హైదరాబాద్‌కు ఆ హీరో… స్వాగతం పలికిన తమిళ దర్శకుడు… సోషల్ మీడియా వేదికగా స్వాగతం…

ప్రముఖ తమిళనటుడు విజయ్ సేతుపతి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. విగ్నేశ్ శివన్ పర్యవేక్షణలో రూపొందుతున్న తమిళ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:32 pm, Tue, 15 December 20
హైదరాబాద్‌కు ఆ హీరో... స్వాగతం పలికిన తమిళ దర్శకుడు... సోషల్ మీడియా వేదికగా స్వాగతం...

ప్రముఖ తమిళనటుడు విజయ్ సేతుపతి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. విగ్నేశ్ శివన్ పర్యవేక్షణలో రూపొందుతున్న తమిళ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాతు వక్కుల రెండు కాదల్ అనే పేరును నిర్ణయించారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తమే విజయ్ హైదరాబాద్‌కు వచ్చారు.  ఈ చిత్రంలో నయనతార, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్ విజయ్ సేతుపతి రాకను ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. హీరో ఎంట్రీ అంటూ పొగిడారు. చిత్రీకరణకు వెల్ కమ్ బ్యాక్ అంటూ స్వాగతం పలికారు. విజయ్ తో పని చేయడం ఎంతో ప్రత్యేకమని అన్నారు. షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాని అన్నారు. కాగా విజయ్ సేతుపతి చిరంజీవి నటించిన సైరా చిత్రంలో కీలక పాత్ర పోషించారు.