Vaarasudu Review: సంక్రాంతి బరిలో నిలిచిన వారసుడు ఏ మేర మెప్పించాడంటే.. మూవీ రివ్యూపై ఓ లుక్కేయండి..

తమిళ నటుడు విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం వారసుడు తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా సంక్రాంతి కానుకగా చిత్రాన్ని తెలుగులో శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సంక్రాంతి బరిలో నిలిచిన వారసుడు ఏ మేర మెప్పించాడో రివ్యూలో చూద్దాం..

Vaarasudu Review: సంక్రాంతి బరిలో నిలిచిన వారసుడు ఏ మేర మెప్పించాడంటే.. మూవీ రివ్యూపై ఓ లుక్కేయండి..
Varasudu Review
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2023 | 11:38 AM

దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఫ్యామిలీ సినిమా వచ్చిందంటే చాలు.. అది మరో సీతమ్మ వాకిట్లో, శతమానం భవతిలా ఉంటుందని ఊహించుకుంటారు. మరి ఇప్పుడు ఇండస్ట్రీ మారి.. తమిళనాడు వెళ్లి విజయ్ లాంటి స్టార్ హీరోతో వారసుడు సినిమా చేశారు. మరి ఆ సినిమా ఎలా ఉంది..? తెలుగులో వారసుడుకు రెస్పాన్స్ ఎలా ఉంది రివ్వూలో తెలుసుకుందాం..

మూవీ రివ్యూ: వారసుడు

నటీనటులు: విజయ్, రష్మిక మందన్న, శ్రీకాంత్, శరత్ కుమార్, సంగీత, కిక్ శ్యామ్, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు

ఇవి కూడా చదవండి

మ్యూజిక్ డైరెక్టర్: ఎస్ .థమన్

సినిమాటోగ్రఫీ: పళనీ కార్తీక్

ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్

నిర్మాత: దిల్ రాజు

స్క్రీన్ ప్లే, దర్శకుడు: వంశీ పైడిపల్లి

కథ:

రాజేంద్రన్ (శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ మెన్. వేల కోట్లకు అధిపతి. తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్)లో ఒకరికి అప్పచెప్పాలని ఆశ పడతాడు. అయితే దానికి తగిన అర్హత నిరూపించుకోవాలని కోరతాడు. దాంతో తనకు అవన్నీ వద్దు.. తన ప్రపంచం వేరు అంటూ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాడు విజయ్. జై, అజయ్ మాత్రం తండ్రి కుర్చీపైనే ఉంటుంది. అదే సమయంలో వ్యాపార ప్రత్యర్ధులు జయ ప్రకాష్ (ప్రకాష్ రాజ్) రాజేంద్రన్ కంపెనీపై కన్నేస్తాడు. అదే సమయంలో అనుకోని సమస్యలో ఇరుక్కుంటాడు రాజేంద్రన్. దాంతో కచ్చితంగా తన వారసుడిని ఎంపిక చేసుకోవాల్సిన గత్యంతరం ఏర్పడుతుంది. అప్పుడే ఏడేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్న విజయ్ అమ్మ కోసం మళ్లీ వస్తాడు. తన తెలివితేటలతో బిజినెస్‌లో నాన్న కంపెనీని ఎలా కాపాడాడు..? విడిపోయిన కుటుంబాన్ని మళ్లీ ఎలా కలిపాడు అనేది అసలు కథ..

కథనం:

ఫ్యామిలీ కథల్లో కొత్తగా చెప్పడానికి ఏముండదు.. ఎమోషన్స్ సరిగ్గా వర్కౌట్ అయితే అంతకంటే అద్భుతమైన కథ మరొకటి ఉండదు. వారసుడులో ఈ ఎమోషన్స్ అన్నిచోట్ల వర్కౌట్ అవ్వలేదు. పైగా సంక్రాంతికి రొటీన్ సినిమాల రేస్ నడుస్తుంది. ఒకరిని మించి మరో దర్శకుడు పరమ రొటీన్ కథలతో వస్తున్నారు. వారసుడు కూడా ఇదే కోవలోకి వచ్చే సినిమా. ఎన్నో సినిమాల్లో చూసిన కథ ఇది. వేల లక్షల కోట్లు ఉన్న కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి.. కానీ కలిసి ఉంటేనే కుటుంబం అనేది వంశీ పైడిపల్లి చెప్పాలనుకున్న లైన్. దాన్ని ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు కానీ.. అందులో సక్సెస్ అయింది మాత్రం కొంతవరకే. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగింది. జయసుధ, విజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

అమ్మ పాట చాలా బాగుంది.. విజువలైజేషన్ అద్భుతం.. యోగి బాబు కామెడీ బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ మొదటి అరగంట సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా చైర్మన్ ఓటింగ్ సీన్ అదిరిపోయింది. ఎమోషన్స్ బాగానే పండినా.. ఎన్నో సినిమాలు మన బుర్రలో మేమున్నామని గుర్తు చేస్తుంటాయి. అదే వారసుడుకు మైనస్ అయింది. రొటీన్ గానే అనిపించినా కూడా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో విజయ్ ఏడేళ్ళ తర్వాత ఇంటికి వచ్చినపుడు జయసుధతో వచ్చే సీన్ చాలా బాగుంది. నాన్న గురించి నిజం తెలిసినపుడు వచ్చే సీన్ చాలా న్యాచురల్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో శ్రీకాంత్ కూతురు సీన్.. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే అన్నీ ఇలా ముక్కలు ముక్కలుగానే వర్కవుట్ అయ్యాయి. వంశీ పైడిపల్లి రాసుకున్న కథ మరీ ఓల్డ్ ఫార్ములా కావడంతో ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. ఓవరాల్ గా వారసుడు.. కొత్తగా ఏం లేదు.. అలాగని చెత్తగా లేదు.. రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

నటీనటులు:

విజయ్‌ని చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో చూడడం బాగుంది. తన ఎనర్జీ ప్లస్ స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ కాదు.. అతిథిలా ఉంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళింది.. పాటల కోసం హీరోయిన్ అన్నట్లుంది. శ్రీకాంత్, శరత్ కుమార్, జయసుధ అందరూ పాత్రలకు న్యాయం చేశారు. ప్రకాశ్ రాజ్ విలనిజం రొటీన్‌గా అనిపిస్తుంది.

టెక్నికల్ టీం:

థమన్ సంగీతం బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. రంజితమే సాంగ్‌కు థియేటర్ ఊగిపోయింది. పళనీ కార్తిక్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమా రిచ్ నెస్ పెంచేసింది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ మాత్రం వీక్. ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. దిల్ రాజు నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. వంశీ పైడిపల్లి మాత్రం మరోసారి రొటీన్ కథనే నమ్ముకున్నాడు. ఇలాంటి కథ చెప్పాలనుకున్నపుడు స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉండాలి. అక్కడే మిస్ ఫైర్ అయింది వారసుడు. స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది. తమిళంలో విజయ్ ఛరిష్మాతో పాస్ అయిపోతుందేమో కానీ తెలుగులో వర్కవుట్ అవ్వడం మాత్రం కష్టమే.

పంచ్ లైన్:

వారసుడు.. సగటు రొటీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు