AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్.. బాక్సాఫీస్ దుమ్ముదులిపిన మెగాస్టార్.. వీరయ్య ఫస్ట్ డే కలెక్షన్స్

కథ గురించి పక్కనబెడితే.. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ వాల్తేరు వీరయ్య. అభిమానులకు ఏం కావాలే అవి సమపాళ్లలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు బాబీ. ఆ విషయంలో అతడికి 100 మార్కులు వేయొచ్చు. కానీ క్లైమాక్స్ మాత్రం నిరాశజనకంగా ఉంటుంది.

Chiranjeevi: వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్.. బాక్సాఫీస్ దుమ్ముదులిపిన మెగాస్టార్.. వీరయ్య ఫస్ట్ డే కలెక్షన్స్
Waltair Veerayya
Ram Naramaneni
|

Updated on: Jan 14, 2023 | 11:26 AM

Share

అన్నయ్య సినిమా దుమ్మురేపింది. వాల్తేరు వీరయ్య అదరగొట్టాడు. పండగ కానుకగా వచ్చిన మెగాస్టార్ సినిమా మంచి టాక్ తెచ్చకుంది. వింటేజ్ చిరు చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సేమ్ టూ సేమ్ అప్పట్లానే బాస్ గ్రేస్ ఉందని చెప్తున్నారు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అదరహో అంటున్నారు. ఇక రవితేజ్ ఫ్యాన్స్ సైతం తమకు కావాల్సిన ఐ ఫీస్ట్ దొరికిందని చెబుతున్నారు. ఎప్పుడో అన్నయ్య సినిమాలో బాస్‌ను, మాస్ మహారాజాను స్క్రీన్‌పై చూశామని.. మళ్లీ ఇన్నాళ్లే తర్వాత వారిని సిల్వర్ స్క్రీన్‌పై కలిసి చూడటం కన్నుల పండుగగా ఉందంటున్నారు. తొలి రోజు కలెక్షన్స్ పరంగా సత్తా చాటాడు వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం శుక్రవారం రూ.29 కోట్లు (అన్ని భాషలతో కలిపి)  రాబట్టింది. 2022లో విడుదలైన చిరంజీవి గాడ్‌ఫాదర్ కంటే వీరయ్య వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. గాడ్ ఫాదర్ మొదటి రోజు రూ. 12.97 కోట్లు రాబట్టింది.

కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన వాల్తేర్ వీరయ్య చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.  ఈ చిత్రంలో శృతి హాసన్ చిరుకి జోడిగా నటించింది. కేథరిన్ థ్రెసా.. రవితేజ్ పెయిర్‌గా మంచి నటన కనపబరిచింది. చిరంజీవి సినిమా రిలీజ్ ఆ హంగామా మాములుగా ఉంటుందా చెప్పండి. శుక్రవారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల హంగామా నడిచింది.

అయితే వాల్తేర్ వీరయ్య విడుదల నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపించింది. గురువారం సింహనాదం చేస్తూ రూ. 33.6 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన..  వీర సింహారెడ్డి శుక్రవారం కేవలం రూ.8.6 కోట్లు వసూలు చేసింది. పండుగ సీజన్ కావడంతో.. 2 సినిమాలు త్వరగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ వారసుడు రిలీజయినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..