AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: మరో వివాదంలో ఆదిపురుష్‌.. నోటీసులు జారీ చేసిన హైకోర్ట్‌. అసలు ఏం జరిగిందంటే.?

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆదిపురుష్‌'. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత భారీ బడ్జెట్‌, భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై...

Adipurush: మరో వివాదంలో ఆదిపురుష్‌.. నోటీసులు జారీ చేసిన హైకోర్ట్‌. అసలు ఏం జరిగిందంటే.?
Adi Purush Movie
Narender Vaitla
|

Updated on: Jan 14, 2023 | 10:44 AM

Share

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత భారీ బడ్జెట్‌, భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై టీజర్‌ విడుదల వరకు ఎలాంటి వార్తలు రాలేవు. కానీ ఎప్పుడైతే టీజర్‌ వచ్చిందో ఈ సినిమా గురించి ఓ రేంజ్‌లో చర్చ జరిగింది. టీజర్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక మరికొందరు టీజర్‌ అస్సలు బాలేదని, యానిమేషన్‌ మూవీలా ఉందంటూ ట్రోలింగ్ చేశారు.

దీంతో ఈ సినిమా అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గ్రాఫిక్‌ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా తాజాగా మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈసారి ఆదిపురుష్‌ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా అలహాబాద్ హైకోర్టు ‘ఆదిపురుష్’కు సంబంధించి సెన్సార్ బోర్డు నుంచి సమాధానం కోరింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రత్యుత్తరం దాఖలు చేయాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డ్‌కు నోటీసులు జారీ చేసింది

సెన్సార్‌ బోర్డ్‌ నుంచి సర్టిఫికెట్‌ పొందకుండానే చిత్ర నిర్మాతలు ఆదిపురుష్‌ సినిమా టీజర్‌ను విడుదల చేశారనేది పిటిషన్‌ దారుని వాదన. అంతేకాంకుడా సీత పాత్రలో నటించి కృతి సనన్ ధరించిన కాస్ట్యూమ్స్‌పై కూడా పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివరాలను కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్ట్‌ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. మరి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంతో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..