Jayasudha: మూడో పెళ్లి వార్తలపై స్పందించిన జయసుధ.. ఫొటోలో పక్కనున్న ఆ వ్యక్తి ఎవరంటే?
ఇటీవల జయసుధ పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఆమెతో ఓ వ్యక్తి కనిపించడమే ఈ రూమర్లకు కారణం. తాజాగా విజయ్ వారసుడు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఆ వ్యక్తితోనే కలిసి హాజరయ్యారీ సీనియర్ నటి. దీంతో ఆమె మూడో పెళ్లి చేసుకుందంటూ పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి.
సహజ నటి జయసుధ మూడో పెళ్లి చేసుకుందంటూ గత రెండు రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ అంశమే హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల జయసుధ పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఆమెతో ఓ వ్యక్తి కనిపించడమే ఈ రూమర్లకు కారణం. తాజాగా విజయ్ వారసుడు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఆ వ్యక్తితోనే కలిసి హాజరయ్యారీ సీనియర్ నటి. దీంతో ఆమె మూడో పెళ్లి చేసుకుందంటూ పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. కొన్ని రోజులు క్రితం అమెరికా వెళ్లిన జయసుధ అక్కడి బిజినెస్ మ్యాన్‌ను సీక్రెట్‌గా వివాహాం చేసుకున్నారని పలు వెబ్సైట్లలో కథనాలు కూడా వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు జయసుధ. ఆమెతో పాటు తిరుగుతున్న వ్యక్తి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చేశారు. ‘గత కొన్ని రోజులుగా నాతో పాటు తిరుగుతున్న వ్యక్తి పేరు ఫెలిపే రూయేల్స్. ఆయనది అమెరికా. నా బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో నా ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే నాతో పాటు ప్రతి ఈవెంట్‌కు వస్తున్నారు. ఫెలిపే ఇంటర్నెట్లో నా గురించి తెలుసుకున్నాడు. అయితే నాకు ఇక్కడ ఫాలోయింగ్ ఎలా ఉంది? నా సినిమాలు, షూటింగ్స్ వివరాలు తెలుసుకునేందుకు నన్ను ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు’ అని క్లారిటీ ఇచ్చారు జయసుధ.
ఇదిలా ఉంటే జయసుధకు గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను పెళ్లాడారు. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆయన కూడా 2017లో కన్నుమూశారు. నితిన్ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. జయసుధ కీలక పాత్రలో నటించిన వారిసు (తెలుగులో వారసుడు) ఈరోజు తెలుగు నాట విడుదలైంది. ఇందులో ఆమె విజయ్‌కు తల్లిగా నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..