Vijay Deverakonda: ఎవ్వరూ మనల్ని ఆపేదే లే.. చిత్తూరు యాసలో అదరగొట్టిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31న గ్రాండ్ జీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

‘కింగ్డమ్’.. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. స్పై యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కింది. జులై 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది ఈ మూవీ. ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదల కానుంది కింగ్ డమ్ మూవీ. తాజాగా కింగ్ డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది.
ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చిత్తూరు యాసలో మాట్లాడి ఆకట్టుకున్నాడు. విజయ్ మాట్లాడుతూ..” ఈసారి నేరుగా మీదగ్గరికే వచ్చాము. నేను ఎప్పుడూ ఈ మాట బయట చెప్పలేదు. గత ఏడాది నుంచి సినిమా గురించి ఆలోచిస్తుంటే.. నా మనసులో గట్టిగా ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి వెంకన్న స్వామి నాతో ఉంటే.. చాలా పెద్దోడినై పూడుస్తా.. వెళ్లి టాప్ లో కూర్చుంటా.. ఎప్పటిలానే ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశా.. ఇక మిగిలింది రెండే ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీసులు.. ఎవ్వరూ మనల్ని ఆపేదే లే.. అంటూ అదరగొట్టాడు విజయ్. మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదల కానుంది. నన్ను ఏడుకొండల వెంకన్న నన్ను చూసుకో స్వామి” అంటూ విజయ్ స్పీచ్ తో అదరగొట్టాడు..
విజయ్ తో పాటు సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ మెంబర్స్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో విజయ్ కు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. విజయ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్. అలాగే యాక్షన్స్ సీన్స్ లో విజయ్ ఇరగదీశాడని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







