Nayanthara: లేడీ సూపర్ స్టార్ 75వ ప్రాజెక్ట్ అప్టేడ్.. గ్రాండ్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్..

ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో జూన్ 9న వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత కూడా నయన్

Nayanthara: లేడీ సూపర్ స్టార్ 75వ ప్రాజెక్ట్ అప్టేడ్.. గ్రాండ్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్..
Nayanthara
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2022 | 3:52 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‏గా క్రేజ్ సంపాదించుకుంది నయనతార (Nayanthara). అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తెలుగు, తమిళ్ భాషలలో వరుస ఆఫర్లను అందుకుంటూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయన్. ఇప్పటివరకు ఆమె అన్ని భాషల్లో కలిపి మొత్తం 74 చిత్రాల్లో నటించింది. ఇక తాజాగా లేడీ సూపర్ స్టార్ 75వ ప్రాజెక్ట్ అనౌన్స్‏మెంట్ ఇచ్చారు మేకర్స్.

ఇటీవలే తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‏కు నయనతారకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో జూన్ 9న వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత కూడా నయన్ మరిన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఆమె 75వ ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్. అతి త్వరలోనే ఈ నయన్ సినిమా ప్రారంభించనున్నట్లు తెలిపారు. నయన్ చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించనుండగా.. జై, సత్యరాజ్ లు ప్రధాన పాత్రలలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అనౌన్స్ చేశారు జీ స్టూడియోస్ బ్యానర్ వారు. అతి త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా లేడీ సూపర్ స్టార్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.