అక్కడ తాకుతూ మాటలు.. ఆపై కమిట్‌మెంట్లు.. నన్ను కూడా ఇలా.. యంగ్ బ్యూటీ కామెంట్స్
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం రెండూ ఉండాల్సిందే. వీటికి తోడు ఆవగింజంతైనా అదృష్టం ఉండాల్సిందే. ముఖ్యంగా సినిమా హీరోయిన్ల విషయంలో ఈ లెక్కలు కచ్చితంగా ఉంటాయి. లేకుంటే అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అవకాశాల్లేక ఇబ్బంది పడతారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

ఇండస్ట్రీలో ఉన్న అది పెద్ద సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి. ఇప్పటికే చాలా మంది నటీమణులు తమకు ఎదురైనా చేదు అనుభవాల గురించి బహిరంగంగా స్పందించారు. దైర్యంగా మీడియా ముందుకు వచ్చి.. ఇండస్ట్రీలో తాము ఎదుర్కున్న లైంగిక సమస్యలు, ఇబ్బందుల గురించి మాట్లాడారు. మరికొంతమంది హీరోయిన్ పలు ఇంటర్వ్యూల్లో షాకింగ్ విషయాలు పంచుకున్నారు. అలాగే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు బయట పెట్టింది..హీరోయిన్లను ఈజీగా కమిట్ మెంట్లను అడిగేస్తూ ఉంటారు అంటూ షాకింగ్ విషయం చెప్పింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరు అని అనుకుంటున్నారా.? చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి ఆతర్వాత హీరోయిన్ గా మారిన అందాల భామ ఆమె.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేక సైలెంట్ అయ్యింది.
ఇది కూడా చదవండి :అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్
ఆమె మరెవరో కాదు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫెమస్ అయిన తేజస్వి మాదివాడ. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించినా, ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది.బిగ్ బాస్ హౌజ్ లో లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైన తేజస్వి మదివాడ ప్రస్తుతం టీవీ షోలతో బిజీబిజీగా ఉంటోంది. అలాగే పలు సినిమా ఫంక్షన్లలోనూ సందడి చేస్తోంటోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అమ్మడు. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిత్యం తన లేటెస్ట్ క్రేజీ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటోంది.
ఇది కూడా చదవండి :ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కమిట్ మెంట్లగురించి ఆమె మాట్లాడింది. నా కెరియర్ ప్రారంభంలో నేను కూడా కమిట్ మెంట్ సమస్యలను ఎదుర్కొన్నాను. సినిమా ఆఫర్స్ కోసం వెళ్తే.. మీరు సాయంత్రం డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ తో డిన్నర్ కు రావాల్సి ఉంటుంది అనేవారు. అప్పుడు నాకు అది అర్ధం కాలేదు. ఆ తర్వాత నా మాట తీరుకు నా విధానానికి అలాంటి సమస్య రాలేదు అని తెలిపింది. కొందరైతే హీరోయిన్లను ఈజీగా కమిట్ మెంట్లను అడిగేస్తూ ఉంటారు. ముందుగా చేతులు తాకుతూ మాటలు కలువుతారు. అలా పదుల సార్లు చేతులు తాకుతూ.. మధ్య క్లోజ్ నెస్ పెరిగేలా చేసి కమిట్ మెంట్లు అడుగుతారు. సినీ పరిశ్రమలోనే కాదు. అన్నీ రంగాల్లోనూ ఇది ఉంది అంటూ తేజస్వి మదివాడ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి రచ్చ మావ..! చేసింది చిన్న పాత్ర.. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ
View this post on Instagram
తేజస్వి మదివాడ ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








