టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కుర్ర హీరో నిఖిల్. హ్యాపీడేస్ సినిమా తర్వాత నిఖిల్ సోలో హీరోగా ఎదుగుతూ వచ్చాడు. కెరియర్ ప్రారంభంలో కథల విషయంలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత మంచి కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. స్వామిరారా సినిమా తర్వాత నిఖిల్ విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే చివరగా వచ్చిన అర్జున్ సురవరం సినిమా కూడా హిట్ అయింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన నిఖిల్.. ఆయా సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం నిఖిల్ సుకుమార్ రైటింగ్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. 18పేజెస్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం 18 పేజెస్ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందింది. అలాగే ఈ సినిమాతోపాటు కార్తికేయ మూవీకి సీక్వెల్ చేస్తున్నాడు నిఖిల్. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కూడా నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ‘కార్తికేయ 2’ కథ ‘ద్వాపరయుగం’నాటి ఒక రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంగా నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తికి పెంచింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..