Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suhas: యూట్యూబ్ నుంచి హీరోగా.. కడుపునిండక.. భవిష్యత్తు కనిపించకా.. సుహాస్ సినిమా కష్టాలు మాములుగా లేవుగా..

యూట్యూబ్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసి.. సిల్వర్ స్క్రీన్ పై నటుడిగా ఇమేజ్ సంపాదించుకున్నారు సుహాస్. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన కలర్ ఫోటో చిత్రానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో

Suhas: యూట్యూబ్ నుంచి హీరోగా.. కడుపునిండక.. భవిష్యత్తు కనిపించకా.. సుహాస్ సినిమా కష్టాలు మాములుగా లేవుగా..
Suhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2023 | 4:38 PM

హీరోగా వెండితెరపై కనిపించాలనే కల. నటనపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. అందులో హీరో సుహాస్ ఒకరు. యూట్యూబ్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసి.. సిల్వర్ స్క్రీన్ పై నటుడిగా ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన కలర్ ఫోటో చిత్రానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా మాత్రం హీరోగా సుహాస్‏కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవలే ఈ చిత్రం జాతీయ అవార్డ్ అందుకుంది. ఇప్పుడు ఆయన హీరోగా రూపొందిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించగా.. టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది.

ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రిమియర్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే తన సొంత ఊరు విజయవాడలో తనకెంతో ఇష్టమైన రాజ్ యువరాజ్ థియేటర్లో రైటర్ పద్మభూషణ్ ప్రీమియర్ వేశారని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశారు సుహాస్. నటుడిగా తన ప్రయాణం ఎలా మొదలైందో గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

“అబ్బో.. ఎక్కడీ నువ్వు ఎక్కడికి వచ్చేసావు రా సుహాసూ.. సినిమాలు తప్ప పుస్తకాలను పట్టించుకోకపోవడము.. కాలేజీ ఎగ్గొట్టి మ్యాట్నీ.. మార్నింగ్ షోకి అటెండెన్స్ వేయడం.. చిరిగిపోయే టికెట్ కోసం లైన్లో చొక్కాలు చింపుకోవడం.. ఇవన్ని తెలిసి నాన్న బెల్ట్ తెగిపోయేలా కోట్టడం.. సినిమా ఛాన్స్ కోసం చెప్పులు అరిగిపోయేలా తిరగడం.. వచ్చిన అరకొర వేషాలతో కడుపునిండక.. భవిష్యత్తు కనపడక.. కళ్లు నీటితో నిండిపోవడం.. యూట్యూబ్ నుంచి దూరంగా.. హీరోగా మొదటి సినిమా వచ్చినప్పుడు అనుకునేలోపు వెండితెర వెయిటింగ్ లో పడి.. ఓటీటీ బ్లాక్ బస్టర్ అవ్వడం.. దానికి జాతీయ అవార్డ్ రావడం.. చివరగా.. విజయవాడకు దూరంగా సినిమాలకు దగ్గరగా.. దాదాపు పదేళ్ళ ప్రయాణం తర్వాత ఏదో అద్భుతంలా ఈ సినిమా పురుగు ఎక్కడో నా బుర్రలో పడిందో అక్కడే నా మొదటి థియేట్రికల్ రిలీజ్. మొదటి ప్రీమియర్ పడటం. అబ్బో ఈ ఫీలింగ్ ఏంటో. మాములుగా లేదుగా సుహాసూ.. మీరు అందరూ చూడండి. ఫిబ్రవరి 3న చాలా బాగుంటుంది. మీకు చాలా నచ్చుతుంది” అంటూ రాసుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.