Trivikram : రామాయణం కోసం రంగంలోకి గురూజీ.. ఏం చేయబోతున్నారంటే
హిందీ సినిమాలు డబ్బింగ్ విషయముల ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. డబ్బింగ్ లో డైలాగ్స్ సరిగ్గా లేకపోవడంతో కొంతమంది విమర్శిస్తున్నారు. అందుకే ‘రామాయణం’ సినిమా డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ‘ రామాయణం’ దర్శకుడు నితీష్ తివారీ డిసైడ్ అయ్యాడట. ఇందుకోసం సౌత్ డైరెక్టర్స్ సహాయం తీసుకుంటున్నాడ దర్శకుడు.
ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అంటూ ఎలాంటి హద్దులు లేకుండా సినిమాలు చేస్తున్నారు దర్శకులు. తెలుగు సినిమాలు చాలా వరకు హిందీలో కూడా రిలీజ్ అయ్యాయి. ఈ వరుసలో ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ , ‘పుష్ప’లాంటి సినిమాలు ఉన్నాయి . హిందీలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తున్నాయి సినిమాలు. అయితే హిందీ సినిమాలు డబ్బింగ్ విషయముల ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. డబ్బింగ్ లో డైలాగ్స్ సరిగ్గా లేకపోవడంతో కొంతమంది విమర్శిస్తున్నారు. అందుకే ‘రామాయణం’ సినిమా డబ్బింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ‘ రామాయణం’ దర్శకుడు నితీష్ తివారీ డిసైడ్ అయ్యాడట. ఇందుకోసం సౌత్ డైరెక్టర్స్ సహాయం తీసుకుంటున్నాడ దర్శకుడు.
‘రామాయణం’ సినిమాపై భారీ అంచనాలకు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త అప్‌డేట్‌ను ఫిలిం సర్కిల్ లో వైరల్ గా మారింది.
హిందీలో ‘రామాయణం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. హిందీతో పాటు ఇతర భాషలల్లోనూ ప్రేక్షకులు ఓన్ చేసుకునేలా తెరకెక్కించాలని.. దర్శకుడు నిర్ణయించుకున్నాడు. తెలుగు డైలాగ్ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని కలిశాడని తెలుస్తోంది. తెలుగులో స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ అయితేనే ఆడియన్స్ ను ఆకట్టుకునేలా డైలాగ్స్ రాయగలరని భావిస్తున్నారట మూవీ టీమ్. ఈ మేరకు త్రివిక్రమ్ ను సంప్రదించారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ‘రామాయణం’ సినిమాలో రావణుడి పాత్రలో యశ్ నటిస్తాడని అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో యష్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ విధంగా కన్నడ డైలాగ్ సమస్య కోసం నితీష్ తివారీ ప్రశాంత్ నీల్‌ని సంప్రదించినట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.