- Telugu News Photo Gallery Cinema photos Will Anupama Parameswaran be a queen in tollywood in her second innings
Anupama Parameswaran: గ్లామర్ క్వీన్‌గా మారనున్న అనుపమ.. టాలీవుడ్ టాప్ లేపనుందా ??
అనుపమ పరమేశ్వరన్ దారెటు..? ఇకపై గ్లామర్ క్వీన్ ఇమేజ్‌తోనే కంటిన్యూ అవుతుందా లేదంటే మళ్లీ పర్ఫార్మెన్స్ అంటూ అటు వైపు వెళ్తుందా..? టిల్లు గాడు తీసుకొచ్చిన గ్లామర్ ఇమేజ్.. అనుపమ కెరీర్‌కు ఎంతవరకు యూజ్ కానుంది..? ఇకపై ఈ భామ ఎంచుకునే పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? టాలీవుడ్‌కు కొత్త గ్లామర్ క్వీన్‌గా అనుపమ మారబోతున్నారా..? ఇండస్ట్రీలో హోమ్లీ ఇమేజ్ రావాలంటే టైమ్ పడుతుంది కానీ గ్లామర్ క్వీన్ అనే ముద్ర రావాలంటే ఎంతసేపు..
Updated on: Apr 04, 2024 | 12:38 PM

అనుపమ పరమేశ్వరన్ దారెటు..? ఇకపై గ్లామర్ క్వీన్ ఇమేజ్‌తోనే కంటిన్యూ అవుతుందా లేదంటే మళ్లీ పర్ఫార్మెన్స్ అంటూ అటు వైపు వెళ్తుందా..? టిల్లు గాడు తీసుకొచ్చిన గ్లామర్ ఇమేజ్.. అనుపమ కెరీర్‌కు ఎంతవరకు యూజ్ కానుంది..? ఇకపై ఈ భామ ఎంచుకునే పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? టాలీవుడ్‌కు కొత్త గ్లామర్ క్వీన్‌గా అనుపమ మారబోతున్నారా..?

ఇండస్ట్రీలో హోమ్లీ ఇమేజ్ రావాలంటే టైమ్ పడుతుంది కానీ గ్లామర్ క్వీన్ అనే ముద్ర రావాలంటే ఎంతసేపు.. ఒక్క సినిమా చేసినంత సేపంతే. ఇన్నాళ్లూ హోమ్లీ బ్యూటీ నీడలోనే ఉండిపోయిన అనుపమ.. టిల్లు స్క్వేర్‌తో డోస్ పెంచేసారు.

ఒక్క సినిమాతోనే తన ఇమేజ్ రూపు రేఖలు మార్చేసుకున్నారు. ఇప్పుడు అనుపమ అంటే కేరాఫ్ గ్లామర్ అన్నమాట. కెరీర్ మొదట్నుంచి అనుపమ పరమేశ్వరన్ అంటే పక్కింటి అమ్మాయి పాత్రలే ఇచ్చారు దర్శక నిర్మాతలు.

ఆమె కూడా అందులోనే తన కంఫర్ట్ చూసుకున్నారు. కానీ రౌడీ బాయ్స్ నుంచి అనుపమ ఆలోచనలు మారాయి. టిల్లు స్క్వేర్‌తో అవి పీక్స్‌కు చేరిపోయాయి. గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్సయ్యాక.. అస్సలు తగ్గేదే లే అంటున్నారు ఈ బ్యూటీ.

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఇకపై ఎలాంటి టర్న్ తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పట్నుంచి గ్లామర్ రోల్స్‌పై ఫోకస్ చేయాలని చూస్తున్నారు అనుపమ. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఈమెకు ఆ తరహా పాత్రలే డిజైన్ చేస్తారనడంలో సందేహం లేదు. మరి ఈ గ్లామర్ క్వీన్ ఇమేజ్‌తో అనుపమ ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది చూడాలిక.




