ముంబైలో 10 రోజుల షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి.. దేవరతో బిజీ కానున్నారు తారక్. దేవర పార్ట్ 1 షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మరో నెల రోజుల్లో ఇది పూర్తి కానుంది. దీని తర్వాత పూర్తిగా వార్ 2పై ఫోకస్ చేయనున్నారు తారక్. మొత్తానికి దేవర పూర్తయ్యే వరకు.. తారక్‌కు ఈ రెండు పడవల ప్రయాణం తప్పట్లు లేదు.