- Telugu News Photo Gallery Cinema photos Tillu Square Movie Team clarity on weekend collections and near to 100 crores, details here Telugu Heroes Photos
Tillu Square Collections: టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్‌లో చేరితే.. సిద్దూ ఆ ఫీట్ లో నిలుస్తారు.
కొన్ని సినిమాలకు హీరోలతో పనుండదు.. కేవలం ఆ కారెక్టర్‌తోనే క్రేజ్ వస్తుంది.. అలాంటి టిపికల్ కారెక్టర్ డిజే టిల్లు. సిద్ధూ జొన్నలగడ్డ క్రియేట్ చేసిన ఈ కారెక్టర్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది. స్టార్ హీరోల రేంజ్‌లో రప్ఫాడిస్తున్నాడు టిల్లు భాయ్. మరి వీకెండ్ ముగిసేసరి టిల్లు స్క్వేర్ సాధించిన రికార్డులేంటి..? కలెక్షన్స్ ఎన్ని..? డిజే టిల్లు వచ్చినపుడు సిద్ధూ జొన్నలగడ్డ అంటే ఎవరో పెద్దగా ఐడియా లేదు..
Updated on: Apr 03, 2024 | 9:41 PM

కథ ఎలా ఉన్నా.. కారెక్టరైజేషన్‌కే కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. డిజే టిల్లుతో ఫస్ట్ టైమ్ ఈ కారెక్టర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసారు సిద్ధూ జొన్నలగడ్డ. ఇప్పుడు టిల్లు స్క్వేర్‌తో అందరి బుర్రల్లోకి దూరిపోయింది.

టాక్ ప్రేక్షకుల్లోకి వెళ్లేముందే.. పోస్టర్‌పై 100 కోట్ల మార్క్ పడిపోతుంది. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు. కేవలం 8 మంది మాత్రమే ఈ రికార్డు అందుకున్నారు. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ సైతం 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టారు.

ఈ మధ్య అలాంటి అద్భుతాలు వరసగా జరుగుతున్నాయి. అసలు 100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టిన మీడియం రేంజ్ హీరోలెవరో చూద్దాం.. స్టార్ హీరోల సినిమాలకు 100 కోట్ల కలెక్షన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు.

స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్.. ఆ మ్యాన్ ఈ మ్యాన్ అంటూ కేవలం కారెక్టర్స్ కోసమే సినిమాలకు వెళ్తుంటారు ఆడియన్స్. తెలుగులో అలాంటి మ్యాజిక్ చేస్తున్నాడు టిల్లు భాయ్.

స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల క్లబ్బులో చేరితే అది మ్యాటరే కాదసలు.. సెంచరీ చేయకపోతే అప్పుడు అసలు మ్యాటర్. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు.. వాళ్లకు 100 కోట్లంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సెంచరీ కొట్టినంత కష్టం.

అసలు టిల్లు సక్సెస్‌లో సిద్ధూ కాకుండా మిగిలిన వాళ్ల పాత్ర ఎంత..? కారెక్టర్‌తో లవ్‌లో పడిపోవడం.. దానికోసమే సినిమాలు చూడటం అనేది మన కల్చర్ కాదు.. అది హాలీవుడ్‌లో జరుగుతుంది.

ఎలాగూ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కాబట్టి టిల్లు గాడి జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు. మొత్తానికి చూడాలిక.. సిద్దూ దూకుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో..?




