- Telugu News Photo Gallery Cinema photos Super Star Rajinikanth plans His Next Movie With Director Gnanavel after thalaivar with lokesh kanagaraj, Details here Telugu Heroes Photos
Rajinikanth: తలైవర్ జోరు.. తమిళ తంబిల హుషారు.! రజిని విజనే వేరు..
రజనీకాంత్‌ని వెతుక్కుంటూ కథలు వెళ్తున్నాయా? ఆయన దగ్గరకు వచ్చే కథల్లో వైవిధ్యమైన వాటిని ఆయన సెలక్ట్ చేసుకుంటున్నారా? విషయం ఏదైనా.. తలైవర్ జోరు మామూలుగా లేదు అని అంటున్నారు తమిళ తంబిలు. ఒకదానితో ఒకటి పొంతన లేకుండా స్టోరీలను సెలక్ట్ చేసుకుంటున్న రజనీకాంత్ గురించి ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు కోలీవుడ్‌లో. జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రజనీకాంత్ విజన్‌ని మెచ్చుకున్నవారే.
Updated on: Apr 03, 2024 | 9:29 PM

ఆల్రెడీ కథ కూడా లాక్ చేసిన నెల్సన్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. ప్రజెంట్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయాన్ సినిమా చేస్తున్న తలైవా, నెక్ట్స్ లోకేష్ మూవీలో నటిస్తారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత హుకుంను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

ఒకదానితో ఒకటి పొంతన లేకుండా స్టోరీలను సెలక్ట్ చేసుకుంటున్న రజనీకాంత్ గురించి ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు కోలీవుడ్‌లో. జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రజనీకాంత్ విజన్‌ని మెచ్చుకున్నవారే. వయసుకు తగ్గ పాత్రలను అద్భుతంగా ఎంపిక చేసుకుంటున్నారంటూ ప్రశంసించినవారే.

జైలర్ సినిమా హిట్ అయినప్పుడు రజనీకాంత్ ఆనందానికి అవధుల్లేవు. అందుకు కారణమైన ఇంతమంది అభిమానాన్ని కాపాడుకోవాలంటే, స్టోరీ సెలక్షన్‌లో జాగ్రత్తగా ఉండాలని పిక్స్ అయ్యారు తలైవర్.. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలోనూ ఇదే రూల్‌ని పాటిస్తున్నారు రజనీకాంత్.

సూపర్‌స్టార్‌కి చాలా ఇష్టమైన జోనర్‌లోనే సాగుతుందట లోకేష్ మూవీ. ఇందులో ఇంటర్నేషనల్ లెవల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేసే డాన్‌గా కనిపిస్తారట రజనీకాంత్. కేజీయఫ్ తరహా మాస్ ట్రెండ్‌లో సాగుతుందట సినిమా. ఈ న్యూస్ లీక్ కాగానే మా తలైవా.. కబాలిరా.. అంటూ మాస్‌గా డైలాగులు చెప్పేస్తున్నారు ఫ్యాన్స్.

తాను సెలక్ట్ చేసుకున్న హీరోలను ఫ్యాన్ బోయ్‌గానే డైరక్ట్ చేస్తానంటున్నారు లోకేష్. విజయ్‌తో సినిమా చేసినా, కమల్‌తో చేసినా ఇప్పటిదాకా అలాగే చేశానన్నది లోకేష్ మాట. చిన్నప్పటి నుంచీ రజనీకాంత్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన ఇమేజ్‌ని ఫ్యాన్స్ ఎలా రిజీవ్ చేసుకుంటారో నాకు బాగా తెలుసు.

అందుకే కథాపరంగా ఆ జాగ్రత్తలు తీసుకున్నాను అని అంటున్నారు లోకేష్ కనగరాజ్. కమల్‌ని విక్రమ్‌లో ఎలా చూపించానో, రజనీకాంత్‌ని నెక్స్ట్ మూవీలో అంతకు వందింతలు అద్భుతంగా చూపిస్తానన్నది ఫ్యాన్స్ కి లోకేష్ ఇస్తున్న కాన్ఫిడెన్స్.

సూపర్ స్టార్‌ను వయసుకు తగ్గ పాత్రలో చూపిస్తూనే ఆయన ఇమేజ్‌ను కూడా పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు. అందుకే జైలర్ ఆడియన్స్‌కు అంత బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. చాలా రోజుల కిందటే నటి మిర్నా సీక్వెల్ న్యూస్‌ను కన్ఫార్మ్ చేశారు.





























