- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna Has 5 Directors including Harish shankar in line for his next Tollywood Movies Telugu Heroes Photos
Balakrishna: బాలయ్య మాకు.. మాకు బాలయ్యే నే కావాలి అంటున్న డైరెక్టర్లు.!
బాలయ్య నాకు కావాలి.. కాదు నాకే కావాలి.. మీరెవ్వరూ కాదు ఆయనతో సినిమా నేనే చేస్తాను..! ఇదిగో ఇలాగే దర్శకులంతా బాలయ్య కోసం ఎగబడుతున్నారు. సడన్‌గా NBK క్రేజ్ ఈ రేంజ్‌లో పెరగడానికి వరస విజయాలే కారణమా లేదంటే ఇంకేదైనా బలమైన రీజన్ ఉందా..? అసలేంటి బాలయ్య సక్సెస్ మంత్ర..? ఆప్నా టైమ్ ఆయేగా అంటారు కదా.. బాలయ్యకు ఆ టైమే వచ్చిందపుడు. NBK మార్కెట్ చూసి కుర్ర హీరోలకు కూడా దడ మొదలైంది.
Updated on: Apr 03, 2024 | 9:11 PM

బాలయ్య నాకు కావాలి.. కాదు నాకే కావాలి.. మీరెవ్వరూ కాదు ఆయనతో సినిమా నేనే చేస్తాను..! ఇదిగో ఇలాగే దర్శకులంతా బాలయ్య కోసం ఎగబడుతున్నారు. సడన్‌గా NBK క్రేజ్ ఈ రేంజ్‌లో పెరగడానికి వరస విజయాలే కారణమా లేదంటే ఇంకేదైనా బలమైన రీజన్ ఉందా..? అసలేంటి బాలయ్య సక్సెస్ మంత్ర..?

ఆప్నా టైమ్ ఆయేగా అంటారు కదా.. బాలయ్యకు ఆ టైమే వచ్చిందపుడు. NBK మార్కెట్ చూసి కుర్ర హీరోలకు కూడా దడ మొదలైంది. ఆ రేంజ్ దండయాత్ర చేస్తున్నారీయన. ఈయనతో సినిమా కోసం డైరెక్టర్స్ తెగ పోటీ పడుతున్నారు.

ముఖ్యంగా ఈ జనరేషన్ దర్శకులే బాలయ్య కోసం కథలు రాస్తున్నారు.. వచ్చే మూడేళ్ల వరకు NBK డైరీ ఫుల్ అయిపోయిందంటే.. ఆయన డిమాండ్ అర్థమైపోతుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య.

జూన్ 10న బాలయ్య బర్త్ డే కానుకగా.. హిందూపూర్‌లో ఈ చిత్ర ఓపెనింగ్ జరగబోతుంది. ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్న అఖండ 2 ఇదే అని.. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ భారీ బడ్జెట్ పెడుతున్నారని అర్థమవుతుంది.

బాబీతో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు బాలయ్య. 1980స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాఫియా మూవీ ఇది. ఎన్నికల కారణంగా షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇవ్వనున్నారు NBK. ఇదింకా 40 శాతం కూడా షూట్ పూర్తి కాకముందే.. బాలయ్య కోసం చాలా మంది దర్శకులు క్యూ కట్టారు.

అందులో హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, ప్రశాంత్ వర్మ ఉన్నారు. ఎన్నికలయ్యేంత వరకు కొత్త సినిమాలేవీ కమిట్ అవ్వట్లేదు బాలయ్య. బోయపాటికి మాత్రమే అఖండ 2 కన్ఫర్మ్ చేసారీయన.

అలాగే హరీష్ శంకర్ సినిమా ఉన్నా.. ఎలక్షన్స్ తర్వాతే క్లారిటీ రానుంది. అనిల్ రావిపూడితోనూ కాంబో రిపీట్ కానుందని తెలుస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ రెమ్యునరేషన్ కూడా తక్కువే కావడంతో బాలయ్య కోసం ఎగబడుతున్నారు దర్శకులు.





























