- Telugu News Photo Gallery Crazy update for Prabhas fans, This is Sanjay Dutt's character in Raja Saab
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్.. రాజా సాబ్‌లో సంజయ్ దత్ క్యారెక్టర్ ఇదే
టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లేదా భారీ చిత్రాల్లో ఒకటిగా తెరెకెక్కుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
Updated on: Apr 03, 2024 | 8:06 PM

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లేదా భారీ చిత్రాల్లో ఒకటిగా తెరెకెక్కుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

2024 మే 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ వెండితెరపై కనిపించనున్నాడు. దీని తర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు.

హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించనున్నాడనే వార్త ఇప్పటికే సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ప్రభాస్ తాతగా నటించిన సంజయ్ దత్ అకాల మరణంతో దెయ్యంగా తిరిగి వస్తాడని ప్రచారం జరుగుతోంది.

సంజయ్ ఉనికి ప్రభాస్ జీవితాన్ని ఎలా మారుస్తుందనేదే ఈ కథ. ఇక ప్రభాస్ సరసన టాలెంటెడ్ నటీమణులు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. రాజా సాబ్ కు మూవీకి థమన్ సంగీత అందిస్తున్నాడు.

అయితే ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కల్కీ తర్వాత మరిన్ని అప్డేట్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.