- Telugu News Photo Gallery Feet Reveal Diseases: From Diabetes To Heart Feet Can Reveal Various Diseases Of Body
Feet Reveal Diseases: పాదాలు చూసి మీ ఒంట్లో ఏయే జబ్బులు ఉన్నాయో చెప్పొచ్చు.. ఎలాగంటే!
ముఖం మనసుకు అద్దం. ముఖాన్ని చూసి మనసును చదవవచ్చు. అయితే పాదాలను చూసి కూడా శరీరంలోని వ్యాధుల గురించి తెలుసుకోవచ్చని మీకు తెలుసా? చాలా మంది ముఖం చూసుకున్నంత జాగ్రత్తగా ఇతర శరీర భాగాల పట్ల శ్రద్ధ వహించారు. కానీ పాదాల విషయంలో మాత్రం మరింత నిర్లక్ష్యం చేస్తుంటారు. చాలా మంది పాదాలపై శ్రద్ధ పెట్టరు. అయితే పాదాలను చూసి శరీరంలో వ్యాధి జాడలను ఎలా కనుగొనాలో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 03, 2024 | 8:34 PM

కొంత మందికి కాలిపై గాయం తగిలితే ఎన్ని రోజులైనా ఆ గాయం నయం కాదు. ఎన్ని మందులు వాడినా ఇన్ఫెక్షన్ మళ్లీ వస్తూనే ఉంటుంది. మీకూ ఇలా జరిగితే మీకు మధుమేహం ఉందని అర్థం. అంటే మీ రక్తంలో చక్కెర స్థాయి పెరిగినట్లు అర్ధం చేసుకోవాలి. పాదాల దురద ఉంటే శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి.

పాదాలు ఉబ్బిపోయాయా? పాదాలు అన్ని వేళలా చల్లగా ఉంటున్నాయా? ఇలాంటి సమస్యలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గుండె సమస్యకు సంకేతం కావచ్చు. పాదాల నొప్పులకు వయసు ఒక్కటే కాదు. ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తుంది. తరచుగా పాదం, చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లయితే యూరిక్ యాసిడ్ స్థాయిలను తనిఖీ చేసుకోవాలి.

నిరంతర కాలు నొప్పి.. హైపోథైరాయిడిజం లక్షణం కావచ్చు. శరీరంలో థైరాయిడ్ లెవెల్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి.

పాదాలు సౌకర్య వంతంగా ఉండే బూట్లు, చెప్పులు మాత్రమే ధరించాలి. అలాగే పాదాలు తడిసిన ప్రతిసారీ వాటిని పొడిగా తుడవాలి. అలాగే సబ్బు, నీళ్లు వాడిన తర్వాత పాదాలకు క్రీమ్ రాసుకోవాలి. పాదాలు ఎంత తేమగా ఉంటే అవి అంత త్వరగా కుదుటపడతాయి. అలాగే పాదాల సంరక్షణకు రెగ్యులర్ పెడిక్యూర్ చాలా అవసరం. పార్లర్‌కి వెళ్లడం సాధ్యం కాకపోతే, ఇంట్లోనే మీ పాదాలకు పెడిక్యూర్ చేసుకోండి.