Kalki 2898 AD: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ రోజు కల్కి రిలీజ్ కష్టమేనా..?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సలార్ సినిమా ఏకంగా 700కోట్ల వరకు వసూల్ చేసింది. అంతే కాదు ఈ సినిమా రెండు పార్ట్ లు గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సలార్ సినిమా ఏకంగా 700కోట్ల వరకు వసూల్ చేసింది. అంతే కాదు ఈ సినిమా రెండు పార్ట్ లు గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ బడా సినిమాలతో బిజీగా మారిపోయాడు. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో కల్కి సినిమా ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వినీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే పోస్టర్స్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు ఉన్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. దిశాపటాని స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
ఇదిలా ఉంటే కల్కి సినిమా గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. ఈ సినిమాలు మే 9న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చు అని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ , గ్రాఫిక్స్ పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయని.. అందువల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తుంది. మరిఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత రాజా సాబ్, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్.
View this post on Instagram