Manchu Mohanbabu: మంచు ఫ్యామిలీలో గొడవలు.. అసలు ఈ వినయ్ ఎవరు ..?
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న మంచు ఫ్యామిలీ గొడవలో వినయ్ అనే పేరు తరచుగా వినిపిస్తోంది, అసలు ఎవరు ఈ వినయ్... కన్న తండ్రి ముందే కొడుకుపై చేయి చేసుకునే అంత పరిస్థితి ఎవరు కల్పించారు.. వినయ్ ఎవరి అండతో ఇదంతా చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మోహన్ బాబు కుటుంబ వివాదంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి ఇతని కారణంగానే మంచు మనోజ్ వివాదం మరింత పెద్దదైందని మంచు మనోజ్ స్నేహితులు ఆరోపిస్తున్నారు అసలు మంచు మోహన్ బాబుతో మనోజ్ ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా వినయ్ మనోజ్ మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇంతకీ వినయ్ మహేశ్వరితో మోహన్ బాబుకున్న సాన్నిత్యం ఏంటో తెలుసుకుందాం… వినయ్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైర్డ్ గా వ్యవహరిస్తున్నారు.
వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి ఆయన గతంలో 2019 నుండి 2022 వరకు ఓ మీడియా సంస్థల CEO గా పనిచేశారు, ఆ తర్వాత కొన్ని రోజులు ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈవోగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇతను మోహన్ బాబు యూనివర్సిటీ తో పాటు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (నిర్మాణ సంస్థ) మేనేజింగ్ పార్ట్నర్ గా మరియు Sucstrat Consulting Private Limited కి మేనేజింగ్ డైరెక్టర్ & CEO గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను నెలలో ఒకటి రెండు రోజులు తిరుపతి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉంటూ, మిగిలిన సమయం అంతా హైదరాబాద్, ఢిల్లీ , ముంబై, దుబాయ్ నగరాల్లో ఉంటాడని అతని సన్నీహిత వర్గం తెలుపుతోంది.
కొంతకాలం క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలపై ఇతనిని కలవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులని కూడా ఇతను కలవడానికి నిరాకరించారు. అప్పుడు స్వయంగా మంచు మనోజ్… తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు ఇస్తూ.. ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అప్పటినుండి ఈ వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తుంది. ఓవైపు తండ్రి మోహన్ బాబు వినయ్ మహేశ్వర్కి బాధ్యతల్లో పెద్దపీట వేయడం మొదటి నుంచి మనోజ్ దాన్ని వ్యతిరేకిస్తూ రావడంతో వినయ్ మనోజ్ మధ్య వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తుంది. మోహన్ బాబు సమక్షంలో జరిగిన గొడవలు వినయ్ మహేశ్వరి తనపై చేయి చేసుకోవడంతో పాటు తన పట్ల అసభ్యంగా దూషించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. ఇదే క్రమంలో దాడి జరిగిన మర్సటి రోజు మోహన్ బాబు ఇంటికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ తో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అప్పటికే ఇంట్లో ఉన్న సీసీ కెమెరా, డీవీఆర్ ను వినయ్ తీసుకెళ్లినట్టుగా తెలియడంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు మనోజ్. ముంబై నుండి వచ్చిన తన సోదరీతో కూడా తనకు డీవీఆర్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో మంచు లక్ష్మి చెప్పిన మనోజ్ వెనక్కి తగ్గ పోవడంతో చివరికి ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కే వరకు వచ్చింది.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




