Manchu Manoj: మోహన్ బాబు ఫిర్యాదు.. మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు..
టాలీవుడ్ సినీయర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు రచ్చకెక్కాయి. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని.. తనకు తన భార్యకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు చేశారు పోలీసులు.

సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని.. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పది మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అటు మోహన్ బాబు సైతం తనకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని లేఖ ద్వారా రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదైంది. తన ప్రాణానికి ముప్పు ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు పై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తనపై, తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని.. ఎవరిపై ఆధారపడకుండానే, స్వతంత్రంగా సమాజంలో గౌరవంగా బతుకుతుకున్నామని అన్నారు. ఆర్థిక సాయం, ఆస్తుల కోసం కుటుంబంపై ఆధారపడలేదని.. తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఈ వివాదంలో తన ఏడు నెలల కూతురిని సైతం లాగడం ఎంతో అమానవీయమని.. ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలలను లాగొద్దని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు మంచు మనోజ్. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలిపే సాక్ష్యాలు అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
తానేప్పుడూ సత్యం, న్యాయం, కుటుంబ ఐక్యత కోసమే నిలబడతానని.. చిన్నతనంలో తన తండ్రి దార్శనికత తనలో స్పూర్తి నింపిందని.. ఇప్పటికీ అదే తనకు మార్గదర్శకమని అన్నారు. ఇది వారసత్వం లేదా ఆస్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదని.. నిజం, న్యాయానికి సంబంధించినదని.. అధికారులు నిష్పక్షపాతంగా దర్యాపు చేస్తారని నమ్ముతున్నానని.. న్యాయం గెలుస్తుందనే ఆశిస్తున్నానని అన్నారు. తనకు తన కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నవారికి ధన్యవాదాలని.. న్యాయం కోసం పోరాడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని ట్వీట్ చేశారు మంచు మనోజ్.
My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




