Thangalaan OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. ఎక్కడ చూడొచ్చంటే..

సాధారణంగా థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వస్తున్నాయి. అందులో తంగలాన్ ఒకటి. అడియన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.

Thangalaan OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. ఎక్కడ చూడొచ్చంటే..
Thangalaan Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2024 | 10:12 AM

సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా తంగలాన్. ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా నేరుగా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్నాళ్లు కోర్టు కేసులు, ఓటీటీతో నిర్మాణ సంస్థకు ఉన్న విభేధాల కారణంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు అనుహ్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా మంగళవారం ఉదయం విడుదలయ్యింది. గత నెలలో ఈ సినిమా రిలీజ్ కు కోర్టు సైతం క్లియరెన్స్ ఇవ్వడంతో ఓటీటీ రిలీజ్ కు అడ్డంకి తొలగిపోయింది. డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ఇందులో పార్వతి తిరువోతు కథానాయికగా నటించగా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది హీరోయిన్ మాళవిక మోహనన్. ఈ చిత్రంలో విక్రమ్ లుక్, యాక్టింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్ హైలెట్ అయ్యింది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.

కథ విషయానికి వస్తే.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటమే తంగలాన్. వారి పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీగా రూపొందించాడు డైరెక్టర్ పా రంజిత్. అడవిలో ఉండే బంగారు నిధిని వెలికితీయడానికి తంగలాన్ (విక్రమ్) వెళతాడు. కానీ ఆ నిధికి ఆరతి (మాళవికా మోహనన్ ) రక్షణగా ఉంటుంది. అసలు ఆరతి ఎవరు ? నిధి కోసం వెళ్లిన తంగలాన్ బృందం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది.. ? అనేది ఈ కథ. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.