AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT : మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో రానున్న ఆహా.. ఆకట్టుకుంటున్న పోస్టర్

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొటీన్ కథలతో కాకుండా కొత్త కొత్త కథలతో సిరీస్ లను తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది.

Aha OTT : మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో రానున్న ఆహా.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Chiranjeev
Rajeev Rayala
|

Updated on: Dec 10, 2024 | 4:50 PM

Share

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు.. అదిరిపోయే వెబ్ సిరీస్‌లను అందిస్తుంది. తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులకు దగ్గరైన ఆహా ఇప్పటికే ఎన్నో సినిమాలు, సిరీస్‌లతో పాటు ఆకట్టుకునే టాక్ షోలు, అలరించే గేమ్ షోలతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో వెబ్ సిరీస్‌తో పేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేసింది ఆహా  టీమ్. రొటీన్‌కు భిన్నంగా ఉండే కథలతో సిరీస్ లను తెరకెక్కిస్తున్న ఆహా.. ఇప్పుడు పౌరాణిక వెబ్ సిరీస్‌తో రానుంది.

ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది

“చిరంజీవ” అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఓ కొత్త వెబ్ సిరీస్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ఆహా సంస్థ.  “యముడితో ఆట”అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ సిరీస్ జనవరి 2025లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ డైరెక్టర్ అభినయ కృష్ణ రూపొందించిన, చిరంజీవ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని అంటున్నారు. అద్భుతమైన కథనంతో ఉత్కంఠభరితమైన దృశ్యాలతో ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సిరీస్ పై అంచనాలు పెరిగిపోయాయి.

ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..

ఎ. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించిన ఈ సిరీస్‌కు ప్రఖ్యాత స్వరకర్త అచ్చు రాజమణి ఆకర్షణీయమైన స్కోర్‌నుఅందించనున్నారు. ఇక ఈ సిరీస్ లో నటించే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. టైటిల్ తోనే సిరీస్ పై ఆసక్తి పెరిగిపోయింది. ఇక వెబ్ సిరీస్ లో ఎవరెవరు నటిస్తున్నారో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ కు సంబందించిన అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వనున్నారు ఆహా టీమ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై