Pushpa 2: రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో కాదు.. పుష్ప 2 తర్వాత డైరెక్టర్ సుకుమార్ ప్రాజెక్టు ఇదే!

‘పుష్ప 2’ సినిమా విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న సుకుమార్ తన తర్వాతి ప్రాజెక్టు గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ (ఆర్‌సీ 17 వర్కింగ్ టైటిల్ ) తో చేయాల్సి ఉంది. అలాగే పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటకే అనౌన్స్ చేశారు. అయితే వీటికి ముందే సుకుమార్ ఓ క్రేజీ ప్రాజెక్టను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

Pushpa 2: రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో కాదు.. పుష్ప 2 తర్వాత డైరెక్టర్ సుకుమార్ ప్రాజెక్టు ఇదే!
Director Sukumar
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2024 | 3:59 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2′ గత వారం విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు వెయ్యి కోట్లకు చేరువలో ఉన్నాయి. కాగా ‘పుష్ప2 ’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తో సమానంగా సుకుమార్ కు క్రేజ్ ఉంది. ‘ఆర్య’, 100% లవ్’, ‘ఆర్య 2’, వన్.. నేనొక్కడినే, ‘రంగస్థలం’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సుకుమార్ ఖాతాలో ఉన్నాయి. ఇక ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలతో బాక్సాఫీస్ లెక్కలు కూడా సరిచేశాడీ లెక్కల మాస్టార్. కాగా పుష్ప 2 తర్వాత సుకుమార్ ఆశ్చర్యకరంగా కమర్షియల్‌ సినిమా కాకుండా ఓ డాక్యుమెంటరీని తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించడానికి కారణం ఆయన తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమానే. ఈ సినిమా కథ అల్లడానికి ఎర్రచందనంపై సుకుమార్ చాలా రీసెర్చ్ చేసాడు. ఎర్ర చందనం ఎక్కడ పెరుగుతుంది? దానిని ఎలా సేకరించాలి? ఎలా అక్రమంగా రవాణా చేస్తున్నారు? ఈ ఎర్రచందనమంతా ఎక్కడికి వెళుతుంది? ఎవరు కొనుగోలు చేస్తారు? ఏ ఉత్పత్తులను తయారు చేస్తారు విషయాలపై పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాడు.

అయితే ‘పుష్ప’ సినిమాలో సుకుమార్ ఈ మొత్తం సమాచారాన్ని కథలో చేర్చలేకపోయాడు. అందుకే ఇప్పుడు ఎర్రచందనంపై డాక్యుమెంటరీ తీసేందుకు సుకుమార్ రెడీ అయ్యారని సమాచారం. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం సుకుమార్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఎర్ర చందనం స్మగ్లింగ్ చరిత్ర, వీటి వెనకనున్న కార్మికుల జీవితం తదితర అంశాలను ఈ డాక్యుమెంటరీ చూపించనున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ డాక్యుమెంటరీ విడుదలయ్యే అవకాశం ఉంది.

1000 కోట్లకు చేరువలో..

‘పుష్ప 2’ సినిమా విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న సుకుమార్ తన తర్వాతి ప్రాజెక్టు గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ (ఆర్‌సీ 17) తో చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు ఎర్రచందనంపై ఓ డాక్యుమెంటరీకి తెరకెక్కించనున్నాడని సమాచారం. ‘పుష్ప 2’ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేస్తానని సుకుమార్ ప్రకటించాడు. అయితే ‘పుష్ప 3’ సినిమా అనౌన్స్ చేయడంతో అందులో విజయ్ కూడా నటించవచ్చని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.