Game Changer: గేమ్ చేంజర్ ముందు పెను సవాళ్లు.. పుష్పా 2 స్ట్రాటజీ ఫాలో అవుతారా?
పుష్ప 2 (Pushpa 2) మూవీతో ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. రానున్న సినిమాలకు బిగ్ టార్గెట్స్ ను సెట్ చేశారు. సినిమా మేకింగ్, టేకింగ్, ప్రమోషన్, రిలీజ్, కలెక్షన్స్ ఇలా ప్రతీ విషయంలోనూ అప్ కమింగ్ సినిమాలకు భారీ టార్గెట్స్ సెట్ చేశారు. త్వరలో పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer) టీమ్ కూడా ప్రజర్ ఫేస్ చేస్తోంది.
పుష్ప 2 తరువాత పాన్ ఇండియా రిలీజ్ కు గేమ్ చేంజర్ (Game Changer) మూవీ రెడీ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండటం, ట్రిపులార్ తరువాత రాం చరణ్ నటించిన సినిమా కావటంతో గేమ్ చేంజర్ మీద ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ అంచనాలకు మించి ప్రజర్ ను ఫేస్ చేస్తోంది ఆ మూవీ టీమ్.
పుష్ప 2తో ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. రానున్న సినిమాలకు బిగ్ టార్గెట్స్ ను సెట్ చేశారు. సినిమా మేకింగ్, టేకింగ్, ప్రమోషన్, రిలీజ్, కలెక్షన్స్ ఇలా ప్రతీ విషయంలోనూ అప్ కమింగ్ సినిమాలకు భారీ టార్గెట్స్ సెట్ చేశారు. దీంతో త్వరలోనే పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతున్న గేమ్ చేంజర్ మీదే ఈ ప్రజర్ ఎక్కువగా కనిపిస్తోంది.
పుష్ప 2 మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ఆ ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారో అన్ని ఎలిమెంట్స్ పక్కాగా ఉండేలా చూసుకున్నారు. అందుకే పుష్ప 2 ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో పర్ఫామ్ చేస్తోంది. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలోనూ ఇలాంటి స్ట్రాటజీ ఉంటేనే బెటర్ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. టార్గెట్ ఆడియన్స్ ఎవరన్నది ముందే ఫిక్స్ చేసుకొని వాళ్లకు తగ్గ కంటెంట్ సినిమాలో పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవటం బెటర్ అంటున్నారు.
ప్రమోషన్ విషయంలోనూ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్లింది పుష్ప 2 టీమ్. తనకు మంచి మార్కెట్ ఉన్న ప్రతీ చోట ఓ ఈవెంట్‌ను ఏర్పాట్ చేసింది. ప్రతీ చోట లోకల్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తన స్పీచులతో అదరగొట్టారు బన్నీ. ఈ ప్రమోషన్ స్ట్రాటజీ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లింది. రిలీజ్ విషయంలోనూ నెవ్వర్ బిఫోర్ నెంబర్స్ ను టచ్ చేశారు పుష్ప 2 మేకర్స్. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 12 వేల 500 స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశారు. పుష్ప సెన్సేషన్ ను మ్యాచ్ చేయాలంటే గేమ్ చేంజర్ కూడా ప్రమోషన్, రిలీజ్ విషయంలో పుష్ప స్టైల్ స్ట్రాటజీ ఫాలో అయితే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్ల విషయంలో కూడా పుష్ప 2 రేంజ్ ను అందుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో ఉంది గేమ్ చేంజర్ యూనిట్. ముఖ్యంగా ట్రిపులార్ తరువాత దేవరతో తారక్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది. సో చరణ్ కూడా సోలోగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకోవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వరుస ఫ్లాపులతో కష్టాల్లో ఉన్న శంకర్ కూడా గేమ్ చేంజర్ తో తన ఇమేజ్ చేంజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. మరి చరణ్, శంకర్ కాంబో మ్యాజిక్ రిపీట్ చేస్తుందా..? పుష్ప 2 తరువాత మరోసారి బాక్సాఫీస్ షేక్ అవుతుందా..? వేచి చూడాల్సిందే.