ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మూవీ.. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కేరాఫ్ కంచరపాలెం ఇప్పటికీ అడియన్స్ మదిలో నిలిచిన సూపర్ హిట్ చిత్రం. ఈ సినిమాతోపాటు ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య వంటి విభిన్న కంటెంట్ చిత్రాలను నిర్మించి జనాలకు దగ్గరయ్యారు నిర్మాత డాక్టర్ ప్రవీణ. ఇక ఇప్పుడు నిర్మాతగా కాకుండా దర్శకురాలిగా మారి చేసిన కొత్త సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు.

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాలను అందుకున్నవి చాలానే ఉన్నాయి. వాటిలో కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా ఒకటి. విలేజ్ రస్టిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా జులై 18న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించారు. ఆమె గతంలో కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాల నిర్మాతగా, నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పించారు, గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి నిర్మించారు. థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్
ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆహా. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఆహాలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఆగస్టు 22న ఆహాలో కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు
Kothapalli పిలుస్తోంది! 🎬
Watch #KothapalliloOkappudu Premieres 22nd Aug only on #aha (24hrs early access for Gold users)@RanaDaggubati @IamPraveenaP @SpiritMediaIN#KothapalliloOkappudu #RanaDaggubati #PraveenaParuchuri pic.twitter.com/IO08xuWGba
— ahavideoin (@ahavideoIN) August 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







