AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింపుల్‌గా కనిపిస్తున్నాడు కానీ ఆయన మామూలోడు కాదు.. ఈయన గురించి తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి

ఈ ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించి మెప్పించారు. అయితే ఆ ఎవరు.? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అని చాలా మందికి తెలియక పోవచ్చు.. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.. ఆయన గురించి తెలిస్తే షాక్ అవుతారు..

సింపుల్‌గా కనిపిస్తున్నాడు కానీ ఆయన మామూలోడు కాదు.. ఈయన గురించి తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి
Actor Kasi Viswanath
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2025 | 12:28 PM

Share

సినిమా అంటే కేవలం, హీరో, హీరోయిన్, దర్శకుడు మాత్రమే కాదు ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా పేక్షకులను మెప్పిస్తున్నారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. ఆయన పేరు వై. కాశీ విశ్వనాథ్. ఈయన చాలా సినిమాల్లో తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దర్శకుడు రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన నచ్చావులే సినిమాలో హీరో తండ్రిగా నటించి మెప్పించాడు. ఈ సినిమాతోనే ఆయన నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు కాశీ విశ్వనాథ్. ఇప్పటివరకు ఆయన వందకు పైగా సినిమాల్లో నటించాడు. అయితే ఆయన గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన దర్శకుడు కూడా.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు కాశీ విశ్వనాథ్. హీరో, హీరోయిన్స్ తండ్రిగా పలు పాత్రల్లో నటించి మెప్పించారు. నటుడిగా సినిమాలు చేయకముందు కాశీ విశ్వనాథ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమాలు చేశాడు. ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ దర్శకుడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసుందాం రా.. సినిమాలకు కో డైరెక్టర్ గా చేశారు. చాలా మంది దర్శకుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది ఆయనకు.. అంతే కాదు కాశీ విశ్వనాథ్ దర్శకుడిగా తన ప్రతిభను కూడా చాటుకున్నారు. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. అప్పటిలో ఆ సినిమా సెన్సేషనల్ హిట్.. ఆ మూవీ మరేదో కాదు నువ్వులేక నేను లేను.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

2002 లో విడుదలైన నువ్వు లేక నేను లేను సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అప్పటి లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా చేశారు. అలాగే లయ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ అందమైన ప్రేమ కథకు వై. కాశీ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు సారథ్యంలో డి. రామానాయుడు సమర్పణలో నిర్మించారు. అలాగే ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమా తర్వాత తొలి చూపులో అనే సినిమాకు కూడా విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత ఆయన దర్శకత్వం వైపు వెళ్ళలేదు, నటుడిగా మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నువ్వులేక నేను లేను అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా డైరెక్టర్ ఈయనే అని చాలా మందికి తెలియదు.

ఇవి కూడా చదవండి

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం