Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఆ ట్యాలెంటెడ్ హీరోనే ఫస్ట్ ఛాయిస్.. ఎందుకు రిజెక్ట్ చేశాడంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' . కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌ గా నటించింది. తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్రలో మెరిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఆ ట్యాలెంటెడ్ హీరోనే ఫస్ట్ ఛాయిస్.. ఎందుకు రిజెక్ట్ చేశాడంటే?
Gangs Of Godavari Movie
Follow us
Basha Shek

|

Updated on: May 30, 2024 | 3:21 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ . కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌ గా నటించింది. తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్రలో మెరిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం (మే 31) గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ తన సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం చెప్పారు. అదేంటంటే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మొదట అనుకున్న హీరో విశ్వక్ సేన్ కాదట. మరో ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తో ఈ సినిమాను తీద్దామనుకున్నారట. అయితే తాను అప్పటికే ఎమోషనల్ జోనర్ మూవీస్ చేస్తుండడం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా హైలీ ఎమోషనల్ మూవీ కావడంతో శర్వానంద్ హోల్డ్ లో పెట్టమన్నారట. అయితే కథ బాగా ఉందని కొద్దిగా సమయం తీసుకుని సినిమా చేద్దామన్నాడట శర్వా.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎమోషనల్ జోనర్ కావడంతో హోల్డ్ లో పెట్టమన్నారు శర్వానంద్. అంతకు ముందే నా మరో సినిమా కూడా ఆగిపోయింది. దీంతో కాస్త భయ పడ్డాను. ఆ తర్వాత నేను ఈ కథను విశ్వక్ సేన్ దగ్గరకు తీసుకెళ్లాను. అతనికి ఈ కథ బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాడు’ అని డైరెక్టర్ కృష్ణ చైతన్య చెప్పుకొచ్చాడు. అలా మొత్తానికి వివిధ కారణాలతో కృష్ణ చైతన్య కథ విశ్వక్ సేన్ దగ్గరకు వెళ్లడం, ఆయన వెంటనే ఓకే చెప్పడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పట్టాలెక్కిందన్నమాట. మరి శర్వానంద్ నిర్ణయం సరైనదేనా? లేక మంచి హిట్ బొమ్మను మిస్ చేసుకున్నారో లేదో సినిమా రిజల్ట్ ను బట్టి చెప్పవచ్చు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు ఓ రేంజ్ లో అలరిస్తున్నాయి. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు నందమూరి బాలకృష్ణ రావడం విశ్వక్ సేన్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!