AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiccha Sudeep: అమ్మబాబోయ్..!! కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఈగ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత సుదీప్ బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు కిచ్చ సుదీప్. ఆ తర్వాత కన్నడలో హీరోగా బిజీగా మారిపోయాడు సుదీప్. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కిచ సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమా మొన్నామధ్య విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.

Kiccha Sudeep: అమ్మబాబోయ్..!! కిచ్చ సుదీప్ కూతుర్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Kiccha Sudeep
Rajeev Rayala
|

Updated on: May 30, 2024 | 3:18 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో విలన్ గా ప్రేక్షకులను భయపెట్టాడు కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్. ఈగ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత సుదీప్ బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు కిచ్చ సుదీప్. ఆ తర్వాత కన్నడలో హీరోగా బిజీగా మారిపోయాడు సుదీప్. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కిచ సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమా మొన్నామధ్య విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు కన్నడ బిగ్ బాస్ కు సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే సుదీప్ ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కన్నడ ప్రేక్షకులకు సుదీప్ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. అయితే ఇప్పుడు కన్నడ నట సుదీప్ కూతురి పేరు తెగ వినిపిస్తుంది. సుదీప్ కూతురు పేరు సాన్వీ సుదీప్ . ఈ అమ్మడు త్వరలోనే సినిమాల్లోకి రానుందని అంటున్నారు. ఈ చిన్నది తన అందాలతో సోషల్ మీడియాలో చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిన్నదానికి సింగర్ అవ్వాలన్న కల. అందుకే మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తుంది. సాన్వికి సంగీతం అంటే ఆసక్తి, రాయడం, పాడడం హాబీ. సుదీప్ మేనల్లుడు మూవీ ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట పాడింది.

సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా సాన్వీ చిన్న టాటూ వేయించుకుంది. ఓ ఇంట్రెస్టింగ్ పచ్చబొట్టు వేయించుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాన్వి సుదీప్ మెడపై ‘పీకు’ అని టాటూ వేయించుకుంది. పీకూ అనేది హిందీ సినిమా పేరు కాదు. పీకూ అనేది సాన్వీ తల్లి ప్రియా సుదీప్ ముద్దుపేరు. ప్రియా సుదీప్‌ను ఆమె తాత పీకు అని పిలుచుకునేవారు. అందుకే సాన్వీ తన తల్లి పేరును టాటూ వేయించుకుంది. ఈ టాటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. చాలా మంది ఈ అమ్మడిని చూసి షాక్ అవుతున్నారు.

సాన్వీ సుదీప్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సాన్వీ సుదీప్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు