Vijay Devarakonda: క్రేజీ ఫ్యాన్ ఆఫ్ రౌడీ హీరో.. వీపుపై విజయ్ ఫేస్‌ను పచ్చబొట్టు వేసుకున్న అమ్మాయి..

ప్రస్తుతం ఈ యంగ్ హీరో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ (Liger) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సరసన

Vijay Devarakonda: క్రేజీ ఫ్యాన్ ఆఫ్ రౌడీ హీరో.. వీపుపై విజయ్ ఫేస్‌ను పచ్చబొట్టు వేసుకున్న అమ్మాయి..
Vijay Devarakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 30, 2022 | 8:54 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా విజయ్‏కు ఉన్న లేడీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమ్మాయిల ఫేవరెట్ హీరోగా మారిపోయాడు విజయ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ (Liger) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , గ్లిమ్ప్స్ సినిమా అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఓ అమ్మాయి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫోటోను వీపుపై టాటూ వేయించుకుంది. అంతేకాకుండా నేరుగా విజయ్‏ను కలిసి సంతోషంతో పొంగిపోయింది. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ ఇద్దరు అమ్మాయిలతో ముచ్చటించారు లైగర్ టీం. అనంతరం అందులో ఓ అమ్మాయి వీపుపై వేయించుకున్న విజయ్ దేరవకొండ టాటూ చూసి సర్ ప్రైజ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లైగర్ చిత్రయూనిట్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. “సూపర్ ఫ్యాన్ మూమెంట్.. కొంతమంది అభిమానులు తమ శరీరంపై టాటూతో తమ అభిమానాన్ని.. గౌరవాన్ని తెలియజేస్తారు. ” అంటూ రాసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.