Shruti Haasan: ప్రభాస్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఒక్కమాటలో తేల్చేసిందిగా..

ప్రస్తుతం ఈ అమ్మడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తోన్న సలార్ సినిమాలో నటిస్తుంది. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న

Shruti Haasan: ప్రభాస్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఒక్కమాటలో తేల్చేసిందిగా..
Shruti Haasan Prabhas
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Jun 30, 2022 | 3:00 PM

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. అందం, అభినయంతో హీరోయిన్‏గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది శ్రుతి హాసన్ (Shruti Haasan). మొదటి సినిమా అనగనగా ఓ ధీరుడు మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నిది.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో శ్రుతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ మూవీతో మళ్లీ ఫాంలోకి వచ్చింది శ్రుతి..

ప్రస్తుతం ఈ అమ్మడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తోన్న సలార్ సినిమాలో నటిస్తుంది. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. ” నేను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటాను.. తన సినిమాలతో మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. కథానాయికగా అతని సినిమాలో ఓ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ తో కలిసి పనిచేయడం చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే అతను ఓ అద్భుతం. సెట్ లో పనిచేస్తున్నట్లుగా అనిపించదు. చాలా సరదాగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2023లో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇందులో జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్