Sonali Bendre : అవన్నీ రూమర్సే.. కొట్టిపారేసిన సోనాలిబింద్రే.. అసలు విషయం ఏంటంటే
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది సోనాలి బింద్రే.. టాలీవుడ్ టాప్ స్టార్ అందరి సినిమాలో ఆడిపాడింది. వారందరి ఫస్ట్ ఛాయిస్ గా కూడా ఈ బ్యూటీనే ఉండేది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది సోనాలి బింద్రే(Sonali Bendre).. టాలీవుడ్ టాప్ స్టార్ అందరి సినిమాలో ఆడిపాడింది. వారందరి ఫస్ట్ ఛాయిస్ గా కూడా ఈ బ్యూటీనే ఉండేది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. ఆ తర్వాత వరుసగా నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే కాని పాతనీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు.. అప్పటికే కొత్తగా వస్తున్న ముంబాయ్ భామలు ఈ బ్యూటీని డామినేట్ చేసేశాయి. దీంతో.. మెల్లిమెల్లిగా అటు టాలీవుడ్ కు.. ఆ తరువాత బాలీవుడ్ కు దూరమై.. ఫ్యామిలీకే పరిమితం అయిపోయింది. ఇక ఆ తరువాత తనకు కాన్సర్ అంటూ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పాటు.. అందర్నీ షాక్ చేసింది.
క్యాన్సర్‌ను జయించి.. తన మనో ధైర్యం ఏంటో అందరికీ చూపించింది. తనలాంటి బాధితుల్లో ధైర్యాన్ని నింపేందుకు తన అనుభవాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోనే మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది సొనాలి. ఇప్పటికే బుల్లి తెరపై జడ్జిగా సందడి కూడా చేస్తోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీ మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేయాలిన అనుకుంటున్నారంటూ.. ఎట్ ప్రజెంట్ తన ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాలేకపోవడేమ ఇందుకు కారణం అని బీ టౌన్ లో ఓ టాక్ రన్ అయ్యింది. అందుకే సినిమాలు చేస్తానంటూ మేకర్స్ ను అడుగుతుందని బీ టౌన్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ.. అవన్నీ రూమర్సే అని కొట్టిపారేసింది. తన పరిస్థితి మంచిగానే ఉందని.. ఎలాంటి ఆర్ధిక పరిస్థితి లేదని.. మంచి కథ దొరికితే సినిమాలు చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడిని తెలుగులో రీ ఎంట్రీ చేయించాలని పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తారక్ సినిమాలో నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలను కూడా సోనాలి కొట్టిపారేసిన విషయం తెలిసిందే .