Happy Birthday Trailer: నవ్వులు పూయిస్తున్న హ్యాపీ బర్త్ డే ట్రైలర్.. లావణ్య సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ సినిమాలోని సరికొత్త పాత్రలే కాదు విభిన్నంగా చేస్తున్న ప్రమోషన్ కూడా సినిమా మీద ఆసక్తి కలిగిస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ

Happy Birthday Trailer: నవ్వులు పూయిస్తున్న హ్యాపీ బర్త్ డే ట్రైలర్.. లావణ్య సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Lavanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2022 | 6:28 PM

టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం హ్యాపీ బర్త్ డే. ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించగా.. నరేష్ ఆగస్త్య కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాలోని సరికొత్త పాత్రలే కాదు విభిన్నంగా చేస్తున్న ప్రమోషన్ కూడా సినిమా మీద ఆసక్తి కలిగిస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8న విడుదల కాబోతున్నది. తాజాగా దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా కథ తుపాకుల చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుంది.. నా ఏడు వారాల నగలతో చేయించా.. నేనూ నా రవ్వల నెక్లెస్ తో చేయించా.. రివాల్వర్ లో ఉండే రాజసం పిస్తోల్లో లేదండి అంటూ గన్స్ గురించి మాట్లాడుకునే మాటలతో ట్రైలర్ ప్రారంభమయ్యింది. వెన్నెల కిశోర్ కౌంటర్స్ తో ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది ఈ ట్రైలర్..

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గోన్న డైరెక్టర్ రాజమాళి మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ వెతికి పట్టుకుంటూ బంగారం తవ్వుకునే సంస్థ. హ్యాపీ బర్త్ డే కూడా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బ్లాక్ బస్టర్ గా ఉంది. చెర్రీకి సినిమా ప్రొడక్షన్ మీద చాలా అవగాహన ఉంది. ఆయన ఏ సంస్థకైనా అస్సెట్ లాంటి వారు. ఈ సినిమా చెర్రికి మంచి సక్సెస్ ఇవ్వాలి. దర్శకుడు రితేష్ కు తన సినిమాల మీద నమ్మకం ఎక్కువ. ట్రైలర్ లో పాన్ తెలుగు సినిమా అని చూడగానే అతనిలో నవ్వొచ్చింది. లావణ్య క్యారెక్టర్ బాగుంది. హీరోయన్స్ కు కథను ముందుండి నడిపే ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు. ఆమె బాగా నటించిందని అర్థమవుతుంది. ఇప్పుడున్న కమెడియన్స్ లో నాకు వెన్నెల కిషోర్, సత్య అంటే ఇష్టం. వాళ్లు టీజర్, ట్రైలర్ లో ఆకట్టుకునేలా ఉన్నారు. కామెడీ, థ్రిల్లర్ కలిపి చేయడం కష్టం. ఒకటి ఎక్కువైతే ఇంకొటి తగ్గిపోతుంది. ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు అంటున్నారు కానీ నా అభిప్రాయం ప్రకారం మనసు పెట్టి కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు ” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?