AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivani Rajashekar: మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. అసలు కారణం ఇదే..

మినా మిస్ ఇండియా 2022 పోటీల్లో 8వ అభ్యర్థిగా ఎంపికైంది. అయితే అనుహ్యంగా శివానీ మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

Shivani Rajashekar: మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. అసలు కారణం ఇదే..
Shivani
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2022 | 8:22 PM

Share

సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి కథానాయికగా అరంగేట్రం చేసి.. అందం, అభినయంతో మెప్పించింది శివానీ రాజశేఖర్ (Shivani Rajasekhar).. అద్భుతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే..ఇటీవల ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల్లో ఎంపికైన సంగతి తెలిసిందే. మినా మిస్ ఇండియా 2022 పోటీల్లో 8వ అభ్యర్థిగా ఎంపికైంది. అయితే అనుహ్యంగా శివానీ మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇందుకు కారణం శివానీకి మిస్ ఇండియా గ్రాంఢ్ ఫినాలే రోజు ఆమెకు ఎగ్జామ్స్ ఉండడమే. శివానీ మెడికల్ స్టూడెంట్.. ఫెమినా మిస ఇండియా 2022 గ్రాండ్ ఫినాలే జరుగనున్న జూలై 3న ఆమెకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి.. ఈ కారణం చేతనే ఆమె ఈ పోటీల నుంచి తప్పుకున్నట్లు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ముందు నా మెడికల్ థియరీ పరీక్షల కారణంగా.. ఆ తర్వాత నేను మలేరియా బారిన పడడం వలన మెజారిటీ ట్రైనింగ్, వస్త్రధారణ సెషన్స్ అన్ని సబ్ కంటెస్ట్ లకు హాజరుకాలేకపోయాను.. త్వరలోనే నేను తిరిగి వెళ్తాను అనుకున్నాను.. కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. నా ప్రాక్టీకల్స్ ప్రీపోన్ చేయబడ్డాయి.. అవి ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి.. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే జరగనున్న జూలై 3న నాకు ఎగ్జామ్ ఇంది.. అందుకే నేను తప్పుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది శివానీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.