KGF 2: కేజీఎఫ్ 2 నటుడికి రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో భయపడ్డానంటూ పోస్ట్..
ఈ సినిమాలో కన్నడ నటుడు అవినాష్ కీలకపాత్రలో నటించాడు. కేజీఎఫ్ మూవీతో భారీ ఆఫలోయింగ్ సంపాదించుకున్నాడు అవినాష్.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాక్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు అవినాష్ కీలకపాత్రలో నటించాడు. కేజీఎఫ్ మూవీతో భారీ ఆఫలోయింగ్ సంపాదించుకున్నాడు అవినాష్. తాజాగా అవినాష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.
“నిన్న ఉదయం 6.05 నిమిషాలకు నా కారు ప్రమాదానికి గురయ్యింది. దేవుడు దయతో నాకు ఎలాంటి గాయాలు కాలేదు. ఒక ఈవెంట్ కు వెళ్లాల్సి ఉండగా.. ఆలస్యమైపోయిందన్న కంగారులో జిమ్ నుంచి ఖాళీగా ఉన్న రోడ్డుపై వేగంగా వెళ్లాను. అదే సమయంలో అనిల్ కుంబ్లే దగ్గర సిగ్నల్ పడింది. ఎదురుగా వస్తున్న కంటైనర్ వేగంగా వచ్చి నా కారును ఢీకొట్టింది. దేవుడి దయతో నాకు ఎలాంటి గాయాలు కాలేదు. అభిమానుల ప్రేమకు నేను కృతజ్ఞతుడిని. కానీ నా కారు బాగా డ్యామేజ్ అయ్యింది. నాకు అండగా నిలబడిన కుటుంబసభ్యులు, స్నేహితులకు చాలా ధన్యవాదాలు. ఆ ట్రక్ డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను చాలా అదృష్టవంతుడిని. ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు అవినాష్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.