Itlu Maredumilli Prajaneekam Teaser: ఆద్యంతం ఆసక్తికరంగా మారేడుమిల్లి ప్రజానీకం టీజర్.. అడవి మనుషుల కోసం నరేష్ పోరాటం..
గురువారం (జూన్ 30న) అల్లరి నరేష్ పుట్టిన రోజు ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో నరేష్ అడవిలో ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య
నాంది సినిమాతో కామెడీ స్టార్‌గానే కాకుండా నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు హీరో అల్లరి నరేష్ (allari naresh). ఇప్పటికే నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, నాంది వంటి వైవిద్యమైన సినిమాల్లో నటించిన నరేష్.. ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం. ఈ చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో, మరో నిర్మాణ హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రీ టీజర్‌తో మారేడుమిల్లి అడువుల్లో చిత్రయూనిట్ పడిన కష్టాలను చూపించారు మేకర్స్.
గురువారం (జూన్ 30న) అల్లరి నరేష్ పుట్టిన రోజు ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో నరేష్ అడవిలో ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిగా కనిపించారు. సాయం సేత్తే మనిషి.. దాడి చేస్తే మృగం..మేం మనుషులమే సారు, మీరు మనుషులతే సాయం సేయండి అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది మారేడుమిల్లి ప్రజానీకం టీజర్. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, ప్రవీణ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
టీజర్..
On my special day,a special something for all of you ?https://t.co/gbt9OqkSKd#ItluMaredumilliPrajaneekam #IMP @kayal_anandhi @zeestudiosofficial @hasyamovies @lemonsprasad @rajdanda @vennelakish @balajigutta @abburiravi @sricharanpakala @raam_dop @chotakprasad @brahmakadali
— Allari Naresh (@allarinaresh) June 30, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.