‘డియర్ కామ్రేడ్’ సెన్సార్ కంప్లీట్!
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, న్యాచురల్ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాసల్లో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు […]
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, న్యాచురల్ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాసల్లో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
ప్రతీ స్టేట్‌లో మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్న చిత్రయూనిట్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మూవీ సెన్సార్ కార్యక్రామలు పూర్తి చేసుకుంది. 2 గంటల 49 నిమిషాల నిడివిగల ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొడతాడేమో చూడాలి.