ప్రభాస్ వల్ల వరుణ్ తేజ్, నానిలకు టెన్షన్..

ప్రభాస్ వల్ల వరుణ్ తేజ్, నానిలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు..? ఎందుకు.. నాని, వరుణ్‌లు వెనక్కి తగ్గాలని అనుకుంటున్నారు..? అవును.. ప్రభాస్ వల్ల వాళ్లిద్దరు టెన్షన్ ఫీలవుతున్నారు. కానీ.. ప్రభాస్‌ని చూసి కాదు.. అతని సినిమా ‘సాహో’ సినిమా విడుదల తేదీ గురించి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజాగా నటించిన సినిమా ‘సాహో’. ఇది ఆగష్టు 30న రిలీజ్ అవుతోంది. ముందు.. ఆగష్టు 15న అనుకున్నా.. కుదరక దాన్ని 30వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. […]

ప్రభాస్ వల్ల వరుణ్ తేజ్, నానిలకు టెన్షన్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 20, 2019 | 1:22 PM

ప్రభాస్ వల్ల వరుణ్ తేజ్, నానిలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు..? ఎందుకు.. నాని, వరుణ్‌లు వెనక్కి తగ్గాలని అనుకుంటున్నారు..? అవును.. ప్రభాస్ వల్ల వాళ్లిద్దరు టెన్షన్ ఫీలవుతున్నారు. కానీ.. ప్రభాస్‌ని చూసి కాదు.. అతని సినిమా ‘సాహో’ సినిమా విడుదల తేదీ గురించి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజాగా నటించిన సినిమా ‘సాహో’. ఇది ఆగష్టు 30న రిలీజ్ అవుతోంది. ముందు.. ఆగష్టు 15న అనుకున్నా.. కుదరక దాన్ని 30వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.

ఇక అదేరోజు.. ఆగష్టు 30న నేచురల్ స్టార్ నాని.. ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ అవుతుండగా.. వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ని కూడా రిలీజ్ చేసేందుకు ఆ చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట. ఇప్పటికే.. గ్యాంగ్ లీడర్ సినిమా లేట్‌గా రిలీజ్‌ అవుతోందని నాని కంగారు పడుతున్నాడు. ఇప్పుడు ‘సాహో’ అనే సరికి మనోడికి ఇంకాస్త కంగారు మొదలైందట. చూడాలి మరి.. గ్యాంగ్ లీడర్‌ని అనుకున్న తేదీకి రిలీజ్ చేస్తారో.. లేక వెనక్కి తగ్గుతారో..! ఇక ‘సాహో’ రిలీజ్ డేట్ వినగానే.. వాల్మీకి వెనక్కి తగ్గాడట. సెప్టెంబర్ 6కి వరుణ్‌ తేజ్ సినిమాను పోస్ట్‌పోన్ చేసుకున్నారని సమాచారం.