Liger: రిలీజ్‌కు ముందే రికార్డు సృష్టించిన లైగర్‌.. ఆ విషయంలో టాప్‌ హీరోలను దాటిన విజయ్‌

Liger  Release: టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన లైగర్‌ విడుదలకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా గురువారం (ఆగస్టు 25)న ప్రేక్షకుల ముందుకు  రానుంది.

Liger: రిలీజ్‌కు ముందే రికార్డు సృష్టించిన లైగర్‌.. ఆ విషయంలో టాప్‌ హీరోలను దాటిన విజయ్‌
Liger
Follow us
Basha Shek

|

Updated on: Aug 25, 2022 | 5:58 AM

Liger  Release: టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన లైగర్‌ విడుదలకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా గురువారం (ఆగస్టు 25)న ప్రేక్షకుల ముందుకు  రానుంది.పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రమోషన్లు కూడా ఓ రేంజ్‌లో నిర్వహించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రి రిలీజ్‌ బిజినెస్‌ కూడా భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 62 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 88.40 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇది విజయ్ కెరీర్‌లోనే టాప్ బిజినెస్ కావడం విశేషం. ఇక థియేటర్ల విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు లైగర్‌. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కలిపి సుమారు 930కి పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఇక తమిళనాడులో 100, కర్ణాటకలో 100, కేరళలో 100, హిందీ ప్లస్ రెస్టాప్ ఇండియాలో 1000, ఓవర్సీస్‌లో 700 థియేటర్లలో విజయ్‌ సినిమాను తీసుకు వస్తున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో లైగర్‌ విడుదల కానుంది. కాగా విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోన్న చిత్రంగా లైగర్‌ రికార్డు క్రియేట్ చేసింది. అదే సమయంలో ఎక్కువ థియేటర్లలో రాబోతున్న తెలుగు చిత్రాల జాబితాలో లైగర్ ఏకంగా ఏడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రాజమౌళి సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (10,200 థియేటర్లు) ఉంది. రెండో స్థానంలో బాహుబలి 2 (9500 థియేటర్లు) ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి