Liger: ఎక్కడ చూసినా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్.. లైగర్ టికెట్లు పంపించండి.. ఛార్మీని రిక్వెస్ట్ చేసిన ప్రముఖ నటుడు
Liger Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లైగర్ విడుదలకు రంగం అంతా సిద్ధమైంది. అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Liger Release: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లైగర్ విడుదలకు రంగం అంతా సిద్ధమైంది. అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తూ పలువురు సెలబ్రిటీలు చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లకు విషెస్ చెబుతూ.. లైగర్ సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. నాకౌట్ పంచ్ గట్టిగా ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు. కాగా చిరు చేసిన ఈ ట్వీట్‌ను చూసి లైగర్ నిర్మాత, నటి ఛార్మీ ఎమోషనల్ అయింది. ‘ఉదయాన్నే ఈ ట్వీట్ చూసి నాకు ఆనందం పట్టలేకున్నాను సర్. వెంటనే మీరు లైగర్ టికెట్ బుక్ చేసుకోండి’ అని ట్వీట్ చేసింది.
అందుకే మేం ముందుగానే బుక్ చేసుకున్నాం కాగా ఛార్మీ ట్వీట్‌పై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ‘ఏంటి చార్మీ గారు.. మీరేం అనుకుంటున్నారు.. గ్రాడ్ యువర్ టికెట్ అంటున్నారు.. ఎక్కడ చూసినా థియేటర్లు మొత్తం ఫుల్ అయి ఉన్నాయ్.. మీరే టికెట్లు పంపించండి’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందుకే మేం ముందుగానే బుక్ చేసుకున్నాం అని కొంత మంది నెటిజన్లు స్పందిస్తే.. మొత్తం హౌస్ ఫుల్ అయ్యాయ్..మాకు కూడా పంపించండి మేడమ్ అని మరికొంత మంది కామెంట్లు పెడుతున్నారు.
What do u mean …’grab ur tickets ‘ Charmee garu..pl send me tkts..house fulls everywhere..#liger https://t.co/suBvTQfDv4
— Brahmaji (@actorbrahmaji) August 24, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..