Venu Thottempudi: స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న వేణు తొట్టెంపూడి..

చాలా మంది ఆర్టిస్ట్ లు ఒకప్పుడు రాణించి ఆ తర్వాత అనుకోకుండా సినిమాలను నుంచి దూరమవుతున్నారు. ఆ తర్వాత చాలా కాలానికి రీ ఎంట్రీ అంటూ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Venu Thottempudi: స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న వేణు తొట్టెంపూడి..
Venu Thottempudi
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2022 | 8:10 AM

చాలా మంది ఆర్టిస్ట్ లు ఒకప్పుడు రాణించి ఆ తర్వాత అనుకోకుండా సినిమాలను నుంచి దూరమవుతున్నారు. ఆ తర్వాత చాలా కాలానికి రీ ఎంట్రీ అంటూ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఇలా చాలా మంది తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఓటీటీలు, వెబ్ సిరీస్ ల హవా నడుస్తుండటంతో రీ ఎంట్రీలు కూడా ఈజీ అయ్యాయి. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో హీరో వేణు తొట్టెంపూడి(Venu Thottempudi)ఒకరు. ఒకప్పుడు హీరోగా రాణించిన వేణు ఆ తర్వాత మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. స్వయం వరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు లాంటి సినిమాలతో మెప్పించిన వేణు.. ఆతర్వాత దమ్ము సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు. ఇక ఇటీవలే మాస్ మహారాజ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో వేణు నటించనున్నాడని తెలుస్తోంది.

వేణుకి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. సూపర్ మహేష్ బాబు సినిమాలో వేణు కీలక పాత్రలో నటించనున్నాడని టాక్. మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వేణు నటించిన చిరునవ్వుతో సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారట మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?