Suriya: అంత కష్టపడ్డాడు కాబట్టే స్టార్ అయ్యాడు.. హీరో కాకముందు సూర్య ఏం చేసేవాడో తెలుస్తే షాక్ అవుతారు.

స్టార్ హీరోగా రాణించడం అంత సులభమేమి కాదు.. స్టార్ డం కంటిన్యూ చేయడం చాలా కష్టం.. కానీ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు హీరో సూర్య(Suriya).

Suriya: అంత కష్టపడ్డాడు కాబట్టే స్టార్ అయ్యాడు.. హీరో కాకముందు సూర్య ఏం చేసేవాడో తెలుస్తే షాక్ అవుతారు.
Surya
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2022 | 7:46 AM

స్టార్ హీరోగా రాణించడం అంత సులభమేమి కాదు.. స్టార్ డం కంటిన్యూ చేయడం చాలా కష్టం.. కానీ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు హీరో సూర్య(Suriya). సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలకు ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. గజినీ సినిమా మన దగ్గర ఏ రేంజ్ కి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సూర్య విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలో మరపురాని పాత్రలో మెప్పించారు సూర్య. సూర్య సినిమా వస్తుందంటే తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఓ ఆసక్తి ఉంటుంది. ఇక సూర్య ప్రయోగాలకు పెట్టింది పేరు. గజినీ నుంచి మొన్నీమధ్య వచ్చిన 24 సినిమా వరకు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి మెప్పించారు. ఇదిలా ఉంటే సూర్య సినిమా ఫీల్డ్ లోకి రాక ముందు ఎం చేశేవారు అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సూర్య మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. సూర్య తండ్రి శివకుమార్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే సూర్య ఇండస్ట్రీలోకి రాకముందు. శివ కుమార్ ఫ్యామిలీ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. శివ కుమార్ కు సినిమా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అప్పుడు సూర్య ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో ఆయన తమ్ముడు కార్తీ ఇంటర్ మీడియట్, చెల్లి పదోవ తరగతి చదువుతున్నారట. డిగ్రీ పూర్తి చేసిన సూర్య రెండు నెలలపాటు ఉద్యోగం కోసం ఎంతో తిరిగారట.. చివరకు ఒక బట్టల దుకాణం లో చిన్న ఉద్యోగం దక్కించుకున్నారు. అప్పుడు సూర్య కు నెలకు 1200 జీతం వచ్చేదట. అలా వచ్చిన జీతంతో తన తల్లికి, చెల్లికి చీరలు కొనిచ్చారట.. ఇక ఇప్పుడు సూర్య దేశంలోనే స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు సూర్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే