Happy Birthday Mahesh Babu : హ్యాపీ బర్త్ డే అవర్ సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మహేష్ ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu).. ఆ పేరులో ఓ వైబ్రేషన్ ఉంది.. ఆ పేరు లో ఓ స్టైల్ ఉంది.. ఆ పేరులో ఓ మత్తుంది.. ఇది మహేష్ ఫ్యాన్స్ చెప్పే డైలాగ్స్.. నిజంగానే మహేష్ అంటే దేశవ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది.

Happy Birthday Mahesh Babu : హ్యాపీ బర్త్ డే అవర్ సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మహేష్ ఫ్యాన్స్..
Mahesh Babu
Follow us

|

Updated on: Aug 09, 2022 | 7:03 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu).. ఆ పేరులో ఓ వైబ్రేషన్ ఉంది.. ఆ పేరులో ఓ స్టైల్ ఉంది.. ఆ పేరులో ఓ మత్తుంది.. ఇది మహేష్ ఫ్యాన్స్ చెప్పే డైలాగ్స్.. నిజంగానే మహేష్ అంటే దేశవ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఎక్కడి లేని ఉత్సాహం.. సూపర్ స్టార్ గా అంతులేని ప్రేక్షాదరణ సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు మహేష్. ఇక మహేష్ కటౌట్ కి, అందానికి ఫిదా కానీ అమ్మాయిలు ఉండరు. చూడటానికి టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తూ లేడీ ఫ్యాన్స్ హృదయాల్లో నిండిపోయాడు ఈ ‘రాజకుమారుడు’. తండ్రిబాటలోనే నడుస్తూ.. ‘యువరాజుగా’ టాలీవుడ్ ను ఏలుతున్నాడు మహేష్. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో సృష్టించిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే.. ఇప్పుడు ఆ రికార్డులను తిరగరాయడం ఈ ”ఒక్కడు” మాత్రమే చేయగలడు అని నిరూపిస్తున్నారు. ”అతడు” స్క్రీన్ పైన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించే ”పోకిరి” ఆయన.. మహేష్ ”దూకుడు” చూసి బాక్సాఫీస్ నోరెళ్లబెట్టాల్సిందే..

ఇప్పటికే మహేష్ ‘ఖలేజా’ ఏంటో దేశవ్యాప్తంగా తెలిసిపోయింది.. సినిమాలతోనే కాదు మంచి మనసున్న శ్రీమంతుడు మా మహేష్ అంటూ ఫ్యాన్స్ ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా సినిమాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ”సరిలేరు నీకెవ్వరు” అనిపించుకుంటున్నారు మహేష్.  1000 మందికి పైగా చిన్నారుల గుండెలను కాపాడిన దేవుడు మహేష్ అంటూ కీర్తిస్తున్నారు ఫ్యాన్స్. ఇదే కాదు మరెన్నో ఎన్నో గుప్తా దానాలను మహెష్ చేస్తుంటారు. కానీ అవేమి చెప్పుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి మహేష్ ఇష్టపడరు. ఇక మహేష్ బాబు పుట్టిన రోజు వచ్చిందంటే మాములుగా ఉంటుందా.. ఆ రోజు పెద్ద పండగే. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటరు అభిమానులు. నేడు మహేష్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు హంగామా చేస్తున్నారు. నిన్నటి నుంచే మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు ట్యాగ్ ట్రేండింగ్ లో ఉంది. ఇక ఇతర హీరోల అభిమానులు సైతం తమ హీరోల ఫోటోలను మహేష్ ఫొటోతో కలిపి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ రోజు మహేష్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు