AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లతో ఇయర్‌‌బడ్స్‌.. మతిపోగొడుతున్న నాయిస్​ బడ్స్‌ ఎన్​2 ప్రో

తక్కువ బడ్జెట్‌లో మంచి ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్న వారికి Noise Buds N2 Pro ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. రూ.1,799 ధరలోనే 32dB ANC, 70 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్, Bluetooth v6.0, Dual Pairing వంటి ఫీచర్లు అందిస్తోంది. మ్యూజిక్ వినడం, కాల్స్ మాట్లాడటం, గేమింగ్ కోసం రోజువారీ ఉపయోగానికి ఈ బడ్స్ ఉపయోగపడేలా ఉన్నాయి.

బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లతో ఇయర్‌‌బడ్స్‌.. మతిపోగొడుతున్న నాయిస్​ బడ్స్‌ ఎన్​2 ప్రో
Noise Buds N2 Pro
Nikhil
|

Updated on: Oct 05, 2026 | 8:10 PM

Share

వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఇప్పుడు మ్యూజిక్, కాల్స్, గేమింగ్‌కు రోజువారీ అవసరంగా మారాయి. అయితే మంచి సౌండ్, నాయిస్ క్యాన్సిలేషన్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న బడ్స్ అంటే ధర కూడా ఎక్కువగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. Noise Buds N2 Pro మాత్రం బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తోంది. స్టైలిష్ లుక్‌తో వచ్చే ఈ ఇయర్‌బడ్స్‌లో ANC, లాంగ్ బ్యాటరీ, కొత్త బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. కేవలం రూ.1,799 ధరలో లభించడం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ప్రశాంతమైన ఆడియో

Noise Buds N2 Proలో 32dB వరకు Active Noise Cancellation సపోర్ట్ ఉంది. దీంతో బస్సు, రైలు లేదా రద్దీగా ఉండే ప్రదేశాల్లో బయట శబ్దాల ప్రభావాన్ని తగ్గించుకుని పాటలు వినొచ్చు. Slate Black కలర్‌లో మెటాలిక్ ఫినిషింగ్‌తో ప్రీమియం లుక్ కనిపిస్తుంది. ఎక్కువసేపు ధరించేందుకు సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేశారు.

70 గంటల ప్లేటైమ్..

ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 70 గంటల వరకు ప్లేటైమ్ లభిస్తుంది. InstaCharge టెక్నాలజీ ద్వారా 10 నిమిషాల ఛార్జింగ్‌తో 200 నిమిషాల వరకు ప్లేటైమ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. Bluetooth v6.0 కనెక్టివిటీతో పాటు Dual Pairing సౌకర్యం ఉంది. గేమింగ్ కోసం తక్కువ లేటెన్సీ మోడ్, కాల్స్ కోసం ENC మైక్రోఫోన్లు కూడా ఉన్నాయి. రూ.1,799 ధరలో ఈ ఫీచర్లు బడ్జెట్ కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Follow Us