AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Singh: ‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. కన్నీళ్లు తెప్పిస్తోన్న బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్

జబర్దస్త్ ఫేమ్ సాయితేజ అంటే ఠక్కున గుర్తురాకపోవచ్చు అదే బిగ్‌బాస్ ప్రియాంక సింగ్ అంటే మాత్రం ఈజీగా గుర్తుపడతారు. పలు టీవీ షోల్లోనూ మెరిసిన సాయితేజ సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో తన జర్నీని గుర్తు చేసుకుంటూ ప్రియాంక షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Priyanka Singh: 'అమ్మాయిగా మారి పదేళ్లు'.. కన్నీళ్లు తెప్పిస్తోన్న బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
Bigg Boss Telugu Fame Priyanka Singh
Basha Shek
|

Updated on: Oct 05, 2026 | 6:57 PM

Share

బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రియాంక సింగ్ ఒకరు. అంతకు ముందు ‘జబర్దస్త్’ షోతో పాటు పలు టీవీ షోల్లో సాయి తేజగా లేడీ గెటప్స్ వేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారింది. దీని తర్వాత బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రియాంక తనదైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. విజేతగా నిలవకపోయినా నిజాయతీగా గేమ్ ఆడుతూ బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. ప్రస్తుతం పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోంది ప్రియాంక సింగ్. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి అక్టోబర్ 5కి పదేళ్లు కావొస్తుండటంతో ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ప్రియాంక. ఇందులో అమ్మాయిగా మారడానికి తాను పడిన కష్టాలను చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యిందీ బిగ్ బాస్ బ్యూటీ. అంతేకాదు ఆరోగ్య పరంగా తానెలాంటి సమస్యలు ఎదుర్కొన్నానో గుర్తు చేసుకుంటూ నాటి ఆపరేషన్ ఫోటోలను షేర్ చేసుకుంది ప్రియాంక.

‘ అమ్మాయిగా నా ప్రయాణానికి నేటితో పదేళ్లు పూర్తయ్యిందన్న విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ప్రియాంక సింగ్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ బాధ, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, గందరగోళం.. అలాగే నేను ఏం చేయాలి? అమ్మాయిగా ఎలా మారాలి అని నన్ను నేను ప్రశ్నించుకున్న క్షణాలన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి. పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అనేక అధ్యాయాలతో నిండిన ఓ జీవితం నాకు కనిపిస్తోంది. అందులో ఒంటరితనంతో గడిచిన ఏళ్లు, సంతోషకరమైన రోజులు, లెక్కలేనన్ని భావోద్వేగాలు, అద్భుతమైన వృత్తిపరమైన విజయాలు, ఒక్కరోజు కూడా పనిచేయని కాలం కూడా ఉన్నాయి. కాలం చాలా మారిపోయింది. నేను మారాను. నా జీవితం మారింది. కానీ అన్నీ పరిస్థితుల్లోనూ నన్ను నేను వదులుకోలేదు. ఈ రోజు నేను అద్దంలో చూసుకుని నేను సాధించాను అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నా పదేళ్ల ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని పూర్తి చేశాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు నేను మహిళగా మారాను.

ఇవి కూడా చదవండి

ప్రియాంక సింగ్ ఎమోషనల్ పోస్ట్..

‘ ఈ రోజు నేను ప్రశాంతంగా, సంతోషంగా, నాకు నచ్చిన విధంగా జీవించగలుగుతున్నాను. అలాగనీ ప్రయాణం ఏ మాత్రం సులభం కాదు.. దీనికి ధైర్యం, సహనం, కన్నీళ్లు, దృఢత్వం, నాపై నాకు ఎంతో నమ్మకం అవసరమయ్యాయి. నాకు ఈ అందమైన జీవితాన్ని ప్రసాదించినందుకు, ముందుకు సాగే శక్తిని ఇచ్చినందుకు, చివరికి నేనుగా మారేలా చేసినందుకు విశ్వానికి ధన్యవాదాలు’ అని ప్రియాంక సింగ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రియాంక ధైర్యాన్ని మెచ్చుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us