Rana Naidu: ఓటీటీ నుంచి ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్ ఔట్.. కారణమదేనా?
ఇంతవరకు ఫ్యామిలీ హీరోగా మాత్రమే తెలిసిన వెంకటేశ్ నోటి నుంచి యథేచ్ఛగా బూతులు రావడం చాలామంది జీర్ణించుకోలేకపోయారు. దగ్గుబాటి రానాపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో రానా నాయుడు సిరీస్ మేకర్స్ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.
దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్ , రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ క్రైమ్ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనావన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి. విచ్చలవిడి అశ్లీల సన్నివేశాలు, అసభ్య పదజాలం కారణంగా తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. ముఖ్యంగా ఇంతవరకు ఫ్యామిలీ హీరోగా మాత్రమే తెలిసిన వెంకటేశ్ నోటి నుంచి యథేచ్ఛగా బూతులు రావడం చాలామంది జీర్ణించుకోలేకపోయారు. దగ్గుబాటి రానాపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో రానా నాయుడు సిరీస్ మేకర్స్ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. అయితే ట్రోలింగ్‌తో సంబంధం లేకుండా టాప్ ట్రెండింగ్ లిస్టులో ఉందీ సిరీస్. ఈ నేపథ్యంలోనే రానా నాయుడు సిరీస్‌కు సంబంధించిన తెలుగు వెర్షన్ తొలగించింది నెట్ ఫ్లిక్స్. అయితే, ఇది పొరపాటున జరిగిందా? లేదా ట్రోల్స్ కారణంగానే తొలగించారా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయంపై ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరణ ఇవ్వాల్సి ఉంది.
రానా నాయుడు సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా, ఆశిష్ విద్యార్థి, అభిషేక్ బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మొత్తం 8 ఎపిసోడ్లతో ఈ సిరీస్ తెరకెక్కింది. దీనికి గానూ వెంకటేష్ ఏకంగా రూ. 12 కోట్లు తీసుకున్నాడని సమాచారం. అలాగే రానా రూ. 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోందిదీనికి సీక్వెల్ ఉంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.
For all Sages who criticized #RanaNaidu ..#Netflix removed Telugu Audio from the series anta… inka edavandi ?#RanaNaiduOnNetflix pic.twitter.com/8fh0DPjwze
— Cinema Ye Prapancham (@cinema_ye) March 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..