Veera Simha Reddy Trailer: గర్జించిన వీరసింహం.. దద్దరిల్లిపోయిన వీరసింహారెడ్డి ట్రైలర్
వీరసింహారెడ్డి సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య సరసన ఈ సినిమాలో హనీ రోజ్, శ్రుతిహాసన్ నటిస్తున్నారు.
నందమూరి నటసింహం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బాలయ్య. వీరసింహారెడ్డి సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య సరసన ఈ సినిమాలో హనీ రోజ్, శ్రుతిహాసన్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు ఒంగోలు లో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పాటలు గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఇక వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, టైటిల్ టీజర్ కు, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో దునియా విజయ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.