Getup Srinu: ఉనికి కోసమే ఇదంతా.. అది పచ్చి అబద్దం.. రోజాపై ఒక్కసారిగా బరెస్ట్ అయిన గెటప్ శ్రీను

మంత్రి రోజాపై ఫైర్ అయ్యాడు నటుడు గెటప్ శ్రీను. ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

Getup Srinu: ఉనికి కోసమే ఇదంతా.. అది పచ్చి అబద్దం.. రోజాపై ఒక్కసారిగా బరెస్ట్ అయిన గెటప్ శ్రీను
Get Up Srinu - Minister Roja
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 06, 2023 | 9:31 PM

గెటప్ శ్రీను.. ఇతడిని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ షోలో విభిన్న గెటప్‌లు వేస్తూ.. అందరి మన్ననలు పొందాడు. అప్పటి జడ్జీలు రోజా, నాగబాబులకు శ్రీను అంటే ఎంతో ఇష్టం. సినిమాల్లో కూడా పాత్రలు వేస్తున్న శ్రీను.. త్వరలో రాజు యాదవ్ సినిమాతో హీరోగా ఫేట్ పరీక్షించుకోబోతున్నాడు. అయితే తాజాగా శ్రీను ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. మంత్రి రోజాను డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశాడు శ్రీను. స్వతహాగా చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన ఈ నటుడు.. మెగా కుటుంబానికి విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఈ క్రమంలోనే మంత్రి రోజా మెగా బ్రదర్స్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌పై కాస్త వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. ‘చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో ,?రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి.  మీ ఉనికి కోసం .. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి .. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి ‘ అంటూ తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చాడు శ్రీను. ప్రజంట్ ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

మాములుగా అయితే వివాదాలకు దూరంగా ఉంటాడు శ్రీను. అతడిపై ఒక్క రిమార్క్ కూడా లేదు. ఈ క్రమంలో గెటప్ శ్రీనుకి ఇంతలా కోపం రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. గెటప్ శ్రీను చేసిన పోస్ట్‌పై వైసీపీ అభిమానులు మాత్రం భగ్గుమంటున్నారు. అటు మెగా ఫ్యాన్స్ శ్రీనుకు తోడుగా నిలబడ్డారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..