Balayya: కాళ్లు మొక్కిన ఫ్యాన్.. బాలయ్య అదిరే పంచ్.. “ఏంటి హెయిర్ కట్ చేయాలా”
బెస్ట్ స్క్రిప్ట్, మాస్ డైలాగ్స్, యాక్షన్, ఎమోషన్స్ విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తారో, హీరోయిన్ విషయంలోనూ అంతే కేర్ తీసుకుంటారు నందమూరి బాలకృష్ణ. రీసెంట్ టైమ్స్ లో ఆయన మూవీస్ చూసిన వారికి ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

ఒంగోలులో బాలయ్య గర్జించాడు. వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్ అదిరిపోయింది. జనాలు వేలాదిగా తరలివచ్చారు. బాలయ్య ఫ్యాన్స్ నినాదాలతో దుమ్మురేపారు. మొత్తంగా ఫంక్షన్ సూపర్ హిట్. అయితే ఈ ఈవెంట్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. బాలయ్య మాట్లాడుతుండగా.. ఓ అభిమాని సైలెంట్‌గా వేదికపైకి వచ్చాడు. అక్కడున్న వాళ్లు ఎవరూ అతన్ని గమనించలేదు. ఈ క్రమంలో సీదా బాలయ్య దగ్గరకు వచ్చిన అభిమాని.. నటసింహం కాళ్లకు దండం పెట్టాడు. ఎవరూ ఊహించని విధంగా.. ఏంటయ్యా హెయిర్ కటింగ్ చేయాలా అంటూ ఫన్నీగా అడిగారు బాలయ్య. దీంతో నవ్వులు పూశాయి. ఆ తర్వాత ఆ అభిమాని మాట్లాడతాను మైక్ ఇవ్వమని అడగ్గా.. బాలయ్య నిరాకరించారు. ఆపై అక్కడున్న వాళ్లు అతడిని పంపించివేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వీర సింహారెడ్డి. బాలయ్యకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ను కూడా ప్రస్టీజియస్‌గా తీసుకున్నారు మేకర్స్. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గ్రాండ్‌గా చేశారు. ఏడాది పొడవునా సినిమాలు రిలీజ్ చేయడం సంగతేమోగానీ, సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆ కిక్కే వేరప్పా. కొత్త అల్లుళ్లు, కోడిపందేలతో పాటు థియేటర్లో స్టార్లు సందడి చేస్తేనే సిసలైన పండగ వచ్చినట్టు.
తెలుగువాళ్ల టేస్ట్ ఎప్పుడో తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి తప్పకుండా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అన్‌స్టాపబుల్ అన్నట్టుంది నందమూరి బాలకృష్ణ చరిష్మా. అనూహ్యమైన రీతిలో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి అన్‌స్టాపబుల్ అనిపించుకున్నారు బాలయ్య. సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఆ చరిష్మాను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న వీరసింహారెడ్డిలోనూ ఆ క్రేజ్ కనిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..



