- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Yukti Thareja Birthday special telugu cinema news
Yukti Thareja: నవయుగ సోయగం ఈ అందాల మందారం.. నాగశౌర్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు యుక్తి..
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త హీరోయిన్ల హావా నడుస్తుందనే చెప్పుకోవాలి. శ్రీలీల, కృతి శెట్టి వంటి కుర్రహీరోయిన్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తమిళ్ బ్యూటీ ఆత్మిక టాలీవుడ్ లో సందడి చేయబోతుంది.
Updated on: Jan 06, 2023 | 12:51 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త హీరోయిన్ల హావా నడుస్తుందనే చెప్పుకోవాలి. శ్రీలీల, కృతి శెట్టి వంటి కుర్రహీరోయిన్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తమిళ్ బ్యూటీ ఆత్మిక టాలీవుడ్ లో సందడి చేయబోతుంది.

ఇక ఇప్పుడు మరో వయ్యారి తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. వెండితెరపై నవయుగ సాయగం అందాల మందారం యుక్తి తరేజా. బాలీవుడ్ బ్యూటీ తెలుగులోనూ అవకాశాలు అందుకుంటుంది.

యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో ఎస్.ఎల్.వి. బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు. క్రితం ఏడాది ఆగస్టులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాతో యుక్తి తరేజా కథానాయికగా పరిచయం కానుంది. తను హర్యానా బ్యూటీ .. మోడలింగ్ మీదుగా సినిమాల్లోకి వచ్చింది. జనవరి 6న యుక్తి పుట్టినరోజు.

గతేడాది యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన లుట్ గయే పాటలో ఇమ్రాన్ హస్మీతో కలిసి నటించింది యుక్తి.

ఇప్పుడు నాగశౌర్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే కళ్యాణ్ రామ్ సినిమాలోనూ ఎంపికైనట్లుగా తెలుస్తోంది.

మోడలింగ్ చేస్తూనే 2019లో ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో పాల్గొంది.





























